Breaking News

స్వస్థ్‌ నారీ ముచ్చటగా మూడు రికార్డులు

Published on Sun, 11/02/2025 - 04:35

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ప్రచార కార్యక్రమం ‘స్వస్థ్‌ నారి, సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ (ఎస్‌ఎన్‌ఎస్పీఏ) మూడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లను సాధించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం... ఈ ప్రచారం దేశంలోని ప్రతి జిల్లాకు చేరింది. 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఆరోగ్య వేదికలలో 11 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.

ఒకే నెలలో 3.21 కోట్ల మందికి పైగా హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌లో పేర్లు నమోదు చేసుకోవడం, రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం ఒకేవారంలో అత్యధికంగా 9.94 లక్షల మంది పేర్లు నమోదు చేసుకోవడం, హెల్త్‌ స్క్రీనింగ్‌ కోసం రాష్ట్ర స్థాయిలో ఒకే వారంలో 1.25 లక్షల మంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవడానికి సంబంధించి ‘ఎస్‌ఎన్‌ఎస్పీఏ’ గిన్నిస్‌ రికార్డ్‌లు సొంతం చేసుకుంది.

‘ఎస్‌ఎన్‌ఎస్పీఏ’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా 1.78 కోట్లమందికి పైగా రక్తపోటు, 1.73 కోట్ల మంది డయాబెటిస్, 69.5 లక్షల మందికి నోటి క్యాన్సర్‌ పరీక్షలు, 1.51 కోట్ల మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. 1.43 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వబడ్డాయి. క్షయవ్యాధికి సంబంధించి 85.9 లక్షలకు పైగా మహిళలకు పరీక్షలు నిర్వహించారు.

కౌన్సెలింగ్, వెల్‌నెస్‌ సెషన్‌లలో 2.14 కోట్ల మంది పాల్గొన్నారు. ‘మై భారత్‌’ వాలంటీర్ల క్రియాశీల భాగస్వామ్యంతో 2.68 లక్షల మందికి పైగా నిక్షయ్‌ మిత్ర ప్రచారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ జాతీయ టీబీ నిర్మూలన క్యాక్రమం (ఎన్‌టిఇపి) కింద క్షయ రోగులకు అండగా ఉండే వ్యక్తులకు ‘నిక్షయ్‌ మిత్ర’ బిరుదు ప్రదానం చేస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)