Breaking News

ఆయుర్వేదానికి షాకిస్తున్న ‘వెండి బంగారాలు’

Published on Fri, 01/16/2026 - 11:54

బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటాయి. దీని ప్రభావం పలు రంగాలపై పడుతోంది. ముఖ్యంగా భగభగమంటున్న బంగారం ధరలకు ఆయుర్వేద వైద్యం విలవిలలాడుతోంది. ఈ మాట వినగానే ఆయుర్వేదానికి, బంగారానికి సంబంధం ఏమిటనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. ఈ రెండింటి మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఆయుర్వేద మందులలలో బంగరాన్ని ఉపయోగిస్తారు. ఏడాది కాలంలో బంగారం ధరలు ఏకంగా 75 శాతం, వెండి ధరలు 167 శాతం పెరిగాయి. ఫలితంగా ఈ లోహాలను ఉపయోగించి తయారుచేసే ఆయుర్వేద మందుల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. బంగారం, వెండిని ఆయుర్వేదంలో ప్రాణరక్షక మందులలో ‘నానో పార్టికల్స్’ రూపంలో వాడుతుంటారు.

ఆకాశానికి ఔషధ ధరలు
ఆయుర్వేద వైద్యంలో బలహీనతను పోగొట్టే ‘స్వర్ణ భస్మం’ ధర రూ. 19 వేల నుండి రూ. 26 వేలకు చేరుకుంది. దీనికి బంగారం ధరల పెరుగుదలే కారణమని తెలుస్తోంది. అలాగే డయాబెటిస్ కోసం వాడే ప్రసిద్ధ మందు ‘వసంత కుసుమాకర్’ ధర రూ. 1100 వరకు పెరిగింది. సాధారణంగా శీతాకాలంలో సంజీవనిలా భావించే ‘వన్‌ప్రాష్’కూడా ధరల పెరుగుదల నుంచి తప్పించుకోలేకపోయింది. బంగారం వాడే మందుల ధరలు 40-50 శాతం, వెండిని వాడే మందుల ధరలు 20-25 శాతం వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

వ్యాధులను నివారించే బంగారం, వెండి
ఆయుర్వేదంలో బంగారం, వెండిని ‘నోబుల్ మెటల్స్’గా పిలుస్తారు. బంగారం శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడానికి ఉపయోగపడితే,వెండి మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఉపకరిస్తుంది. తీవ్రమైన కాలిన గాయాలకు వాడే క్రీములలో, ఇన్ఫెక్షన్ నివారణ మందులలో వెండిని విరివిగా ఉపయోగిస్తుంటారు. బంగారం, వెండి ధరలు ఇదే రీతిన పెరిగితే రోగులకు నాణ్యమైన చికిత్స అందించడం కష్టమని నిపుణులు అంటున్నారు.

వైద్య విద్యార్థులు డీలా..
బంగారం ధరల పెరుగుదల ప్రభావం కేవలం రోగులపైనే కాకుండా, ఆయుర్వేద విద్యార్థులపైన కూడా పడుతోంది. పీహెచ్‌డీ విద్యార్థులు తమ పరిశోధనల కోసం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 1.30 లక్షలు దాటడంతో, ప్రభుత్వం ఇచ్చే రూ. 60-80 వేల స్టైపెండ్ దేనికీ సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు తమ జేబుల నుండి డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ఇది వారి పరిశోధనలకు ఆటంకంగా మారింది.

కుదేలైన ఆయుర్వేద వ్యాపారం 
రాజస్థాన్‌లో ఆయుర్వేద మందుల వార్షిక వ్యాపారం సుమారు రూ. 100 నుండి 150 కోట్లుగా ఉంది. జలుబు, దగ్గు, డయాబెటిస్, యూరినరీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులకు వాడే దాదాపు 50 రకాల మందులలో ఈ బంగారం, వెండి లోహాలను ఉపయోగిస్తారు. వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం, వెండి కోటింగ్ ఉండే మాత్రల ధరలు కూడా 10 శాతం మేరకు పెరిగాయి. ఫలితంగా కొనుగోళ్లు తగ్గి, వ్యాపారం మందగించింది.

ముందులు కొనలేక విలవిల
బంగారం ధరల పెరుగుదల  కారణంగా  ఆయుర్వేద వైద్యులు ఖరీదైన మందులను ప్రిస్క్రిప్షన్‌లో రాయడానికి వెనుకాడుతున్నారు. ఒకవేళ రాసినా, పేద రోగులు వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. మరోవైపు మందుల తయారీ కంపెనీలు ధరలను నియంత్రించేందుకు నాణ్యత లేని ముడి పదార్థాలను వాడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పరోక్షంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

దంత వైద్యం కూడా భారమే.. 
కేవలం ఆయుర్వేద వైద్యమే కాదు.. దంత వైద్యం కూడా  ఖరీదైనదిగా మారింది. పళ్లలోని క్యావిటీలను నింపడానికి, క్రౌన్స్ వేయడానికి వాడే సిల్వర్ అలాయ్ పౌడర్ ధరలు భారీగా పెరిగాయి. గతంలో 30 గ్రాముల సిల్వర్ అలాయ్ ధర రూ. 2,638 ఉండగా, ఇప్పుడు అది రూ. 3,808కి చేరింది. ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లలో ఒక పంటి ఫిల్లింగ్‌కు రూ. 800 నుండి రూ. 1000 వరకు వసూలు చేస్తున్నారు.

తీవ్ర అస్థిరత
జనవరి 14 నాటి గణాంకాల ప్రకారం.. వెండి కేవలం మూడు రోజుల్లోనే రూ. 34 వేలు పెరిగి కిలో రూ. 2.78 లక్షల వద్ద ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. బంగారం కూడా 10 గ్రాములకు రూ. 1.42 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్థాయి భారీ పెరుగుదల గతంలో ఎన్నడూ లేదని, ఫలితంగా వైద్య , పరిశ్రమల రంగాల్లో తీవ్ర అస్థిరత నెలకొన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: 2026 ‘బిగ్ ఫైట్’: అటు బెంగాల్ పులి.. ఇటు తమిళ ‘దళపతి’!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)