Breaking News

భారత్‌లో ‘మిస్‌ వరల్డ్-2024 ఈవెంట్‌, 28 ఏళ్ల తర్వాత

Published on Sat, 01/20/2024 - 10:42

అందాల పోటీలకున్న  క్రేజే  అంతా ఇంతా కాదు. అందులోనూ ప్రపంచ అందగత్తెలంతా పోటా పోటీగా ఒక చోట చేరితే.. దాదాపు మూడు దశాబ్దాల  తర్వాత భారత దేశంలో ఇదే జరగబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా  ఆతిథ్యం ఇవ్వనుంది.  1996 తరువాత మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ జరగబోతోంది.  ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022  సినీ శెట్టి   మిస్ వరల్డ్ 2023కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.

ఈవెంట్ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు  ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ పోటీలను  అట్టహాసంగా నిర్వహించనున్నారు. మార్చి 9న నిర్వహించే ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా  ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. . ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని  హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC)  ఆధ్వర్యంలో "ది ఓపెనింగ్ సెర్మనీ" , "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈవెంట్‌ షురూ అవుతుంది. 

మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో  జూలియా మోర్లీ స్వయంగా ఈ  విషయాన్ని మిస్ వరల్డ్  అధికారిక పేజీ ట్విటర్‌ పేజీలో  షేర్‌ చేశారు.  మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం గర్వంగా ఉందంటూ  హర్షం వ్యక్తం చేశారు. అందం, వైవిధ్యం  సాధికారత మేళవింపుగా జరగబోతున్న ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్‌ చేసింది. 2017లో మానుషి చిల్లార్‌  తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్  కిరీటాన్ని దక్కించుకోలేదు.

అందాల  రాణులుగా నిలిచిన  భారతీయ భామలు  ఎవరో తెలుసా?
రీటా ఫరియా - 1966
ఐశ్వర్యా రాయ్ - 1994
డయానా హేడెన్ - 1997
యుక్తా ముఖి - 1999
ప్రియాంకా చోప్రా - 2000
మానుషి చిల్లార్ - 2017

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)