Breaking News

Indian Economy ‘నాలుగు’లోకి వస్తున్నా..

Published on Tue, 05/27/2025 - 09:54

ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్‌ మరొక మైలురాయిని చేరుకోబోతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్‌.) ‘వరల్డ్‌ ఎకనా మిక్‌ అవుట్‌ లుక్‌ – 2025’ నివేదిక ప్రకారం 2025లో 4.187 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్, 4.186 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2027 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్లకి చేరుకుంటుందనీ, 2028 నాటికి 5.58 ట్రిలియన్‌ డాలర్లతో జర్మనీని కూడా అధిగ మించి అమెరికా, చైనాల తర్వాత మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనీ ఐఎంఎఫ్‌ అంచనా వేస్తోంది. 

భారత్‌ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా మొదటి రెండు స్థానాలలో ఉన్న అమెరికా (30.5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ), చైనా (19.2 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ)లకూ భారత్‌కూ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. అనేక అంశాలలో భారత్‌ దయనీయమైన స్థానాల్లో ఉంది. ఉదాహరణకు తలసరి ఆదా యంలో ప్రపంచంలో 141వ ర్యాంకు, మానవాభివృద్ధి సూచికలో (హెచ్‌డీఐ) 134వ ర్యాంకు,

ప్రపంచ ఆకలి సూచీలో 105వ ర్యాంకు, స్థూల సంతోష సూచీలో 118వ ర్యాంకుల్లో నిలిచింది. ప్రపంచంలో మొదటి పది పెద్ద ఆర్థిక వ్యవస్థలలో పదివేల డాల ర్లతో భారత్‌ మాత్రమే అతి తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది.  చైనా తలసరి ఆదాయం దరిదాపు 25 వేల డాలర్లు. భారత్‌ కంటే తక్కువ జీడీపీజపాన్, బ్రిటన్, ఫ్రాన్స్‌ ఇటలీ, కెనడా, బ్రెజిల్‌లాంటి ఆరు దేశాలలో మొత్తం జనాభా కేవలం 57 కోట్లుగా ఉంటే... ఆ దేశాల సంపద 18 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ ఆరు దేశాల జనాభా కంటే భారత్‌ జనాభా రెండు రెట్లు ఎక్కువ.

‘ఆక్స్‌ఫామ్‌ ఇండియా రిపోర్టు–2024’ ప్రకారం భారతదేశంలో సంపద అసమానతలు పెరిగిపోతున్నాయి. 40 శాతం జాతీయ సంపద ఒక్క శాతం ధనికుల చేతిలో కేంద్రీకృతమై ఉంటే, 77 శాతం జాతీయ సంపద 10 శాతం ధనికుల చేతులలో ఉంది. ‘హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌– 2025’ ప్రకారం, భారత్‌లో 284 మంది బిలియనీర్లు ఉంటే వారి సంపద మొత్తం 98 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో మూడవ వంతు.

కోవిడ్‌ లాంటి విపత్కర పరిణామాల అనంతరం ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు నెలకొనే ఛాయలు కనిపించినప్పటికీ, స్థిరమైన వృద్ధిరేటు సాధిస్తున్న దేశంగా భారత్‌ నిలదొక్కుకోవటానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటమే కారణమని ఐఎంఎఫ్‌ భావిస్తోంది. కాబట్టి రాబోయే దశాబ్దంలో భారత్‌ మరిన్ని అద్భుత ఆర్థిక విజయాలు సాధిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేస్తోంది. 

– డా. తిరునహరి శేషు
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)