Breaking News

మీకు తెలుసా?ఆఫీస్‌లో గర్భిణీలతో అలాంటి పనులు చేయించకూడదు

Published on Tue, 08/15/2023 - 12:10

మీరు టూ వీలర్‌ డ్రైవ్‌ చేస్తున్నారు.. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఫాలో అవుతూ! హెల్మెట్‌ పెట్టుకున్నారు.. ఆర్‌సీ.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను క్యారీ చేస్తున్నారు.. బండికి ఇన్సూరెన్స్‌ ఉంది.. పొల్యూషన్‌  ఫ్రీ సర్టిఫికెట్‌ కూడా ఉంది.. అయినా ట్రాఫిక్‌ పోలీస్‌ మిమ్మల్ని ఆపారు.. మీ బండి కీ లాక్కున్నారు!

ఓ ప్రైవేట్‌ సంస్థ.. తన ఉద్యోగులకు నెల నెలా సరిగ్గా జీతాలే ఇవ్వట్లేదంట!ఇలా చెప్పుకుంటే బోలెడు.. ట్రాఫిక్‌ పోలీస్‌ హెరాస్‌మెంట్‌ నుంచి ఎమ్‌ఆర్‌పీని మించి ధరను వసూలు చేసే దుకాణదారు దాకా! ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయననే పోలీస్‌ నుంచి చెల్లని చెక్‌ ఇచ్చే పరిచయస్తుల వరకు!అన్నీ సమస్యలే.. అంతటా మోసాలే!అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అన్నట్టుగానే పైవాటన్నిటీకీ పరిష్కారం హక్కుల రూపంలో మన రాజ్యాంగంలోనే ఉంది! చట్టాలుగా వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..!!  

పోలీస్‌ యాక్ట్‌ 1861
ప్రతి భారతీయ పౌరుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన యాక్ట్‌ ఇది. దీని ప్రకారం పోలీస్‌లు 24 గంటలూ విధినిర్వహణలో ఉండాలి యూనిఫామ్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా!

మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 1961

దీని ప్రకారం.. ప్రెగ్నెన్సీ వల్ల విధులకు హాజరు కాలేకపోతున్న ఉద్యోగినిని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు ఏ యజమానికి, ఏ అధికారికీ లేదు. తీస్తే అది శిక్షార్హమవుతుంది. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. పదిమంది ఉద్యోగులున్న ప్రతి ప్రైవేట్‌ సంస్థ గర్భిణీ ఉద్యోగులకు 84రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలి. 

గర్భిణీ ఉద్యోగులతో ఇలాంటి పనులు చేయించకూడదు

ఉద్యోగం కోసం వచ్చిన మహిళ.. ప్రసవమై లేదా గర్భస్రావమై ఆరువారాలు దాటలేదని తెలిస్తే.. ఆమెను వెంటనే ఉద్యోగంలో నియమించకూడదు. ఆరువారాలు దాటితేనే నియమించాలి.   ప్రసవమై లేదా గర్భస్రావమైన ఉద్యోగిని ఆరు వారాలు దాటితే కాని తిరిగి విధుల్లో చేర్చుకోకూడదు. అలాగే విధులకు సంబంధించి ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా.. గర్భిణీ ఉద్యోగికి గంటలు గంటలు.. అదీ నిలబడి చేసే పనిని అస్సలు అప్పగించకూడదు. అంతేకాదు గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపేంత ఒత్తడినీ ఆమె మీద పెట్టకూడదు. గర్భస్రావానికి దారి తీసే పరిస్థితి.. లేదా ఆమె ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపేంత పనినీ ఆమెకు పురమాయించకూడదు. 

1955 హిందూ వివాహ చట్టం

భార్యభర్తలు విడాకులు పొందాలనుకుంటే ఈ చట్టం ప్రకారం ఆ జంట పెళ్లయిన ఏడాది వరకు ఆగాల్సిందే. పెళ్లయిన ఏడాదిలోపు విడాకులను మంజూరు చేయదీ చట్టం. అయితే ప్రతి చట్టం ఏదో ఒక వెసులుబాటును ఇస్తున్నట్టే ఫ్యామిలీ లా కూడా ఓ వెసులుబాటును కల్పిస్తోంది. అదేంటంటే.. భార్య, భర్తలు ‘పరస్పర అంగీకారంతో’ పెళ్లయిన ఏడాదిలోపు కూడా విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివాహేతర సంబంధం, శారీరక, మానసిక హింస, నపుంసకత్వం, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్లిపోవడం, హిందూ మతంలో ఉన్న భాగస్వామి వేరే మతాన్ని స్వీకరించడం, మానసిక వ్యాధులు, మొండి జబ్బులు, ఏడేళ్ల వరకు భాగస్వామి జాడ తెలియకపోవడం వంటి కారణాల కింద భార్య, భర్తల్లో ఎవరైనా విడాకులు కోరవచ్చు.  

సమాన పనికి సమాన వేతనం 

1976, ఈక్వల్‌ రెమ్యునరేషన్‌ యాక్ట్‌ ప్రకారం.. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఒకేరకమైన వాతావరణం.. ఒకేరకమైన పరిస్థితుల్లో ఒకేరకమైన పనిని ఒకేరకమైన సామర్థ్యంతో చేస్తున్నట్లయితే  ఎలాంటి భేదభావం చూపకుండా అందరికీ సమాన వేతనమే ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వనట్లయితే సంబంధిత లేబర్‌ అధికారికి యజమాని మీద ఫిర్యాదు చేయవచ్చు. ఆ అధికారులు విచారణ చేపట్టి.. అవసరమైన చర్యలు తీసుకుంటారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)