Breaking News

పర్ఫెక్ట్‌ క్రిస్పీ దోసె వెనుక ఇంత సైన్సు ఉందా..?

Published on Mon, 12/01/2025 - 17:59

దోసెలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మెత్తగా నోట్లో కరిగిపోయే వాటికంటే..చక్కగా కరకరలాడే క్రిస్పి దోసెలంటే కొందరికి మహా ఇష్టం. అందులోనూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ దోసె. అలా రావడానికి పెద్ద సైన్సు సూత్రమే ఉందట. దాన్ని సాక్షాత్తు ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌  సోషల్‌మీడియా ఎక్స్‌ వేదికగా వివరించడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

బంగారు రంగులో నోరూరించే ఈ దోసెలకు సైన్సుకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెబుతున్నారు పోస్ట్‌లో. సాధారణంగా దోసెలను వేసే ముందు పాన్‌ లేదా తవాపై ముందుగా నీళ్లు చిలకరిస్తారు గమనించారా..!. అది వేడెక్కిందా లేదా టెస్ట్‌ చేసుకుని మరి దోసెలు వేస్తుంటారు. దీన్ని లైడెన్‌ఫ్రాస్ట్ ఎఫెక్ట్‌ అంటారు. ఆ ప్రభావం వల్లే దోసె పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తుందట. అది ఏవిధంగానో కూడా క్లియర్‌గా వివరించారు.

లైడెన్‌ఫ్రాస్ట్ ప్రభావం అంటే ..
మనం వేడివేడి పాన్‌ లేదా తవాపై నీళ్లు చిలకరించగానే నీరు ఉబ్బి ఆవిరైపోదు. నీటి బుడగలా వచ్చి.. పాన్‌ ఉష్ణోగ్రత నుంచి తనను కాపాడు కునేలా ఆవిరి పొరను ఏర్పరుచకుని అటు ఇటు జర్రు జర్రున జారుతూ ఉంటుంది. అదే పాన్‌ లేదా తవా వేడెక్కకపోతే నీటి బిందువులు పాన్‌కే అతుక్కుపోతుంది. పైగా పాన్‌ నెమ్మదిగా వెడేక్కగానే గాల్లో ఆ నీరు ఆవిరైపోతుంది. దీని గురించి 18వ శతాబ్దంలోనే జర్మన్‌ శాస్త్రవేత్తలు వివరించారు గానీ అంతకుమునుపే భారతీయుల వంట గృహాల్లో ఈ సిద్ధాంతంతో ఎంతో సంబంధం ఉంది. 

ఇలా ఆదర్శ ఉష్ణోగ్రత వద్ద నీటి బిందువులు పాన్‌ ఉపరితలంపై జారేందుకు దోహదపడిన ఎఫెక్టే పిండి పాన్‌కి అతుక్కోకుండా చక్కగా వచ్చేందుకు కారణం అవుతుందట. అలాగే పాన్‌ చుట్టు పిండి స్పెండ్‌ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందట. అదే పాన్ గనుక వేడెక్కకపోతే..పాన్‌పై దోసె సరిగా స్ప్రెడ్‌ అవ్వదు, పైగా పాన్‌కి దోసె అతుక్కుపోయి అట్టులా కాకుండా విరిగిపోతుందని వివరించాడు. ఈ లైడెన్‌ఫ్రాస్ట్‌ ఎఫెక్ట్‌ వల్లే అంతలా క్రిస్పీ దోసెలను రుచిగా తినగలమని చెప్పుకొచ్చారు. మన వంటిళ్లు ఫిజిక్స్‌ సూత్రాల నిలయం కదూ..!.

 

(చదవండి: సినిమా రేంజ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజల్‌..! నెటిజన్ల ప్రశంసల జల్లు)

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)