రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఇన్ని లాభాలా..!

Published on Thu, 06/06/2024 - 12:52

పూర్వం నుంచి రాత్రి భోజనం తర్వాత నాలుగు అడుగులు వేయండి అని మన పెద్దలు తరుచుగా చెబుతుంటారు. భోజనం అయ్యిన వెంటనే పడక మీద వాలిపోవద్దని అంటుంటారు. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయమే చెబుతుంటారు కూడా. అసలు దీని వల్ల ఏం జరుగుతుంది? కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

భారతీయ సంప్రదాయంలో ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు కొందరూ. రాత్రి భోజనం అయ్యిన వెంటేనే కాసేపు ఆరు బయట అలా కబుర్లు చెప్పుకుంటూ నడవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. రాత్రి భోజనం తర్వాత కనీసం ఓ అరగంట నడిస్తే చాలని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. ఇలా చేస్తే కలిగే ప్రయోజనాలేంటంటే..

  • రాత్రి భోజనం తర్వాత ఓ 30 నిమిషాల పాటు నడిస్తే మన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా ప్రోత్సహిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని నివారించి అజీర్ణాన్ని దరి చేరనియ్యదు. ఇది ప్రేగుల ఆరోగ్యానికి మంచిది కూడా. 

  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్‌ స్పైక్‌లను నిరోధించడంలో ఉపయోగపడుతుంది. ఇలా నడవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పైగా తేలికపాటి వ్యాయామం శరీరానికి అంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. 

  • అలాగే అదనపు కేలరీలను బర్న్‌ చేస్తుంది. ఇలా నడవడం వల్ల శరీరం మంచి పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. 
    ఈ నడక వల్ల కుటుంబ సభ్యులతో గడిపే ఒక చక్కటి అవకాశం కూడా దొరుకుతుంది. ఒకరకంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

చాలామంది వైద్యులు డిన్నర్‌ తర్వాత నడక గణనీయమైన ప్రయోజనాలనను పొందగలరని నొక్కి చెబుతున్నారు. ఉదయం వాకింగ్‌ ఎముకల ఆరోగ్యానికి మంచిదైతే సాయంత్రం భోజనం తర్వాత కొద్దిపాటి నడక జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదే సమయంలో అలాంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు

చేయకూడనవి ఏంటంటే..

  • అసౌకర్యం లేదా అజీర్తి రాకూడదంటే భారగీ భోజనం చేసినట్లయితే వెంటనే నడవకూదు. కనీసం 15 నుంచి 30 నిమిషాలు విరామం ఇచ్చి నడిస్తే మంచిది. 

  • వేగంగా కూడా నడవకూడదు. ఇది తిమ్మిర్లు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. 

  • డిన్నర్‌ తర్వాత నడిస్తే కొందరికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటివాళ్లు ఉదయం, సాయంత్రాల్లో నడిచేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. 

  • అలాగే తేలిక పాటి నడకే మంచిది. ఏదో కేలరీలు బర్న్‌ అవ్వాలి అన్నంతగా ఆ సమయంలో నడవకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(చదవండి:  ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్‌'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!)

 

#

Tags : 1

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)