Breaking News

చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది

Published on Mon, 02/12/2024 - 02:06

‘‘చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది’’ ఇది జనుల వాడకంలో ఉండి, అందరి నోళ్లలోనూ నానుతూ ఉన్న మాట. పాపం అంటే ఇతరులకు అపకారం చేసినందువల్ల వచ్చే ఫలితం. దీనిని మామూలు మాటల్లో చెప్పాలంటే తప్పు. అందరూ అంగీకరించనిది. మానవమాత్రులు తప్పు చేయకుండా ఉండటం అసంభవం. తెలిసి కాకపోయినా, తెలియకుండా అయినా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు.  

తప్పు అంటే ఏదైనా ఇతరులకి బాధ కలిగించే పని కాని, ధర్మానికి విరుద్ధమైన పని కాని చేయటం. ఎదుటివారికి మంచి అనుకుని చేసినది వారికి హాని కలిగించవచ్చు. అనుకోకుండా చేసినట్టయితే దానిని ‘‘తప్పు అయి పోయింది’’ అని ఒప్పుకొని ఎవరికి హాని కలిగిందో వారిని క్షమించమని అడిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిహారం సమర్పించో, మరొక విధంగానో సద్దుబాటు చేసుకునే వీలు ఉంటుంది. ధర్మానికి అపచారం జరిగితే? .. ..  దానిని కూడా ఒప్పుకొని పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఇవి చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అయితే పరిణామం వేరొక విధంగా ఉంటుంది.    

చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే తాను చెప్పుకోవటమే కాదు. ఈ పాపం గురించి పదిమంది చెప్పుకుంటే అని. ఏదైనా విషయం గురించి ఎంత మంది మాట్లాడుకుంటే దాని ఫలితాన్ని అంతమంది పంచుకుంటారు కదా! ఆ విధంగా తాను చేసిన పనికి సంబంధించిన ఫలితాన్ని ఎంతోమంది పంచుకోవటం కారణంగా కర్తకి ఆ పనివల్ల కలగవలసిన తీవ్ర నష్టం సద్దుబాటు చేయబడుతుంది.

‘‘కర్తా కారాయితా చైవ ప్రేరకశ్చానుమోదకః / సుకృతే దుష్కృతే చైవ చత్వారినః సమ భాగినః’’. కారయితలు (చేయించినవారు), ప్రేరకులు కాకపోయినా దాని గురించి మాట్లాడుకున్నవారికి కొంత  ఫలితం చెందుతుంది. కనుక కర్తకి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని పనుల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాని, అది చేయకూడని పని అయితే చేయగలిగినది ఏమీ ఉండదు.

తాను చేసిన తప్పుని చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం ధర్మమార్గంలో నడిచే వారికి మాత్రమే ఉంటుంది. ‘‘సత్యే ధర్మం ప్రతిష్ఠితా’’, ధర్మం సత్యంలోనే నిలిచి ఉంటుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు మాత్రమే ధర్మమార్గంలో ఉన్నట్టు. తన గొప్ప, ఘనతలు మాత్రమే కాక అపజయాలు, లోపాలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా సందర్భం వచ్చినప్పుడు చెప్పగలగాలి. అప్పుడు అది ఎంతోమందికి మార్గదర్శక మౌతుంది.

పొరపాట్లు ఎట్లా దొర్లుతాయి? వాటిని ఏ విధంగా అధిగమించ వచ్చు? అని అవగాహన చేసుకోవటానికి గుణపాఠం అవుతుంది. తాను చేసిన పాపం అందరికీ తెలిస్తే గౌరవం తగ్గిపోతుందనే భయం ఉంటుంది సాధారణంగా. వాస్తవానికి తాత్కాలికంగా అదే జరిగినా, రాను రాను గౌరవం పెరుగుతుంది. నిజాయితీపరులు, మంచి చెడు తెలిసిన వారు అని. ఒకరి ద్వారా తెలియటం కాక తామే చెప్పటం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇతరులకి తెలిసి, వారు గోరంత విషయాన్ని కొండంత చేసి, ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఈ పారదర్శకత నాయకుడుగా ఉండేవారికి తప్పని సరి.

చేసిన పాపం ఇతరులకి తెలిస్తే చులకన అయిపోతామేమో అనే ఆలోచనతో బయటికి చెప్పరు చాలమంది. చెప్పుకుంటే పరిహారం ఎట్లా చేయవచ్చో సూచనలు అందే అవకాశం ఉంటుంది. ఈ మాట అన్నంత మాత్రాన ప్రకటనలు చేయమని కాదు. శ్రేయోభిలాషుల వద్ద మనసులో ఉన్న బరువు దింపుకుంటే తేలిక అవుతుంది. లోలోపల కుమిలి పోవటం, బయట పడుతుందేమోననే భయం, ఆందోళన ఉండవు. అప్పుడు తరువాతి కర్తవ్యం గోచరిస్తుంది. ఇదంతా తప్పు చేశాననే భావన ఉన్న వారి విషయంలో. తప్పు అని ఒప్పుకోటానికే ఇష్టం లేనివారి గురించి చెప్పటానికి ఏమీ లేదు.

– ఎన్‌.అనంతలక్ష్మి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)