Breaking News

ఆయ్‌.. ఇది సినిమా ఇల్లండి..

Published on Tue, 02/24/2026 - 10:57

బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌లోని ఈ ఇల్లు సినిమా షూటింగ్‌లకు ప్రత్యేక గమ్యస్థానం. మూడు దశాబ్దాలుగా నిత్యం షూటింగ్‌ల కళకళతో వెలిగిపోతోంది. ఫిలింనగర్‌లో 1985లోనే విశాలమైన ప్లాట్‌లో ఏపీలో గోదావరి జిల్లాలు, గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాల నిర్మాణ శైలికి అనుగుణంగా చక్కని ఇంటిని నిర్మించారు. ఇటీవల సీరియల్స్‌ షూటింగ్‌లు కూడా జరుగుతున్నాయి. 

అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి నుంచి మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ల సినిమాల వరకు ఈ ఇంట్లో ఏదో ఒక దృశ్యం చిత్రీకరించడం విశేషం. ఆకట్టుకునే నిర్మాణం, విశాల ప్రాంగణం, సహజ వెలుతురు, పచ్చని లాన్‌తో కూడిన ఈ ఇల్లు నిజంగా ‘సినిమా వాళ్ల ఇళ్లు’ అనేలా ఉంది. దర్శక, నిర్మాతలు దీనిని షూటింగ్‌ లొకేషన్‌గా ఎంచుకోవడంతో రోజూ ఇక్కడ సినిమా సందడి కనిపిస్తుంటుంది. ఇంట్లోని ఆర్కిటెక్చర్, బాల్కనీలు, గార్డెన్‌ ఏరియా, ఇంటీరియర్‌ సెటప్‌ ఆల్‌ ఇన్‌ వన్‌ ప్యాకేజీతో ఉండడంతో సినిమా సన్నివేశాలకు సహజ వేదికగా మారింది. 

ఒకేచోట ఇంటి సన్నివేశాలు, బయటి సన్నివేశాలు చిత్రించే వీలుండడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ ఇల్లు.. కెమెరాలు, క్లాప్‌లు, లైట్లు, టెక్నిషియన్ల సందడితో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒక సెట్‌లాగా మారిపోతుంది. నిజ జీవితంలో నివాసంగా ఉంటూనే తెరపై వేర్వేరు కథలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటివరకు 5 వేలకు పైగా సినిమా షూటింగ్‌లు ఇందులో జరిగాయి. చాలాసార్లు హీరో–హీరోయిన్ల నివాసాలుగా దీనినే చూపించారు. ఇటీవల టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు కూడా  జోరుగా సాగుతున్నాయి.  

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)