Breaking News

మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Sun, 06/09/2024 - 17:58

మంచి రుచికరంగా వంట చేయడం ఓ కళ. అయితే ఇప్పుడూ చాలా విభిన్నమైన కొత్త కొత్త రుచులు వచ్చేస్తున​న్నాయి. అంతా వాటిని ట్రై చేస్తున్నారు కూడా. అయితే రుచికి మాత్రమే కాదు, వండే విధానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వమని హెచ్చరిస్తోంది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌). వండేటప్పుడూ మూత పెట్టకుండా వండితే ఇక అంతే సంగతులను గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చింది. దీని వల్ల ఎక్కవసేపు మంటమీద ఉడికించాల్సి రావడమే గాక ఆరోగ్యానికి హనికరమని చెబుతుంది. ఎలా వండితే మంచిదో కూడా వెల్లడించింది. అవేంటో సవివరంగా చూద్దామా..!

ఓపెన్‌ మూత వర్సెస్‌ క్లోజ్డ్ వంట:
మూత పెట్టి కూరలు వండితే సమయం ఆదా అవ్వడమే గాక పోషకాల నష్టం కూడా ఉండదని చెబుతోంది. అదే మూత లేకుండా వండితే..ఎక్కువసేపు పట్టడమేగాక ఆహార పదార్థాలు ఎక్కువ సేపు ఉష్ణోగ్రతలోనే ఉడకటంతో పోషకల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది. అలాగే మూత పెట్టి వండే వంటలో త్వరితగతిన వండేయగలం, మంచి పోషకవంతంగా ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా ఆకుపచ్చ కూరలను మూతపెట్టి వండితే కూర రంగు మారి, పోషకాల నష్టాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. 

ఆరోగ్యకరమైన వంట పద్ధతులు..
పప్పు దినులు పోషక నాణ్యత ఉండాలంటే మూత పెట్టి ఉడకించడం లేదా ప్రెజర్‌ కుక్కర్‌లో వంట చేయడం ఉత్తమం అని చెబుతోంది. అంటే మూతపెట్టి ప్రెజర్‌లో తగు మోతాదులో ఉడకించడం వల్ల పోషకాల నష్టం జరగకుండా కాపాడటమే గాక తొందరగా ఉడికిపోతాయి. పైగా ఆయా ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. అదీగాక ఇలా వంట చేయడం వల్ల ఆయా పదార్థాల ఆకృతిమారి, రుచికరంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి కూడా. దీని వల్ల హానికరమైన సూక్ష్మజీవులు ప్రమాదం కూడా ఉండదని, ఆహారం కలుషితం కాదని ఐసీఎంఆర్‌ పేర్కొంది. 

మైక్రోవేవ్‌లో వంట మంచిదేనా..
ఇక్కడ మైక్రోవేవ్‌ కూడా త్వరితగతిన వండేస్తుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. ఎక్కువసేపు మంట మీద ఉడకించే పద్ధతులతో పోలిస్తే పోషకాలు విచ్ఛిన్నం కాకుండా తక్కవ టైంలోనే త్వరితగతిన వండేసే పద్ధతులు బెటర్‌ అని చెప్పకనే చెప్పింది. మైక్రోవేవ్‌లో తక్కువ టైంలోనే ఆహార పదార్థాలు ఉడికిపోతాయి కాబట్టి విటమిన్‌లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చేయడంలో సహాయ పడుతుందని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లో పేర్కొంది.

(చదవండి: రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..! ఇంటర్‌ ఫెయిల్‌ అవ్వడమే..!)
 

#

Tags : 1

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)