Breaking News

ఎవరీ విశ్వనాథ్‌ కార్తికే..? జస్ట్‌ 16 ఏళ్లకే..!

Published on Tue, 01/28/2025 - 09:03

దక్షిణ అమెరికాలోని ఎత్తైన శిఖరం అకాన్కాగువా (22,837 అడుగులు)ను అధిరోహించి మరో సారి చరిత్ర సృష్టించాడు హైదరాబాద​ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడు పడకంటి విశ్వనాథ్‌ కార్తికే. ఇప్పటికే వివిధ ఖండాల్లోని ఎత్తైన పర్వతాలు, శిఖరాగ్రాలను చేరుకుని భారతీయ జెండాను సగర్వంగా ఎగురవేసిన విశ్వనాథ్‌ కార్తికే తన ఖాతాలో మరో ప్రపంచ ఎత్తైన పర్వతాన్ని చేర్చాడు. 

నగరంలోని రెసొనెన్స్‌ జూనియర్‌ కళాశాలలో 11వ తరగతి చదువుతున్న విశ్వనాథ్‌ కార్తికే, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు భరత్‌ తమ్మినేని, భారత సైనిక అధికారి లెఫ్టినెంట్‌ రోమిల్‌ బారాత్వల్‌ మార్గదర్శకత్వంలో నాలుగు సంవత్సరాలుగా ఎత్తైన పర్వతారోహణకు కఠిన శిక్షణ పొందుతున్నాడు. 

ఈ ప్రయత్నంలో భాగంగానే బూట్స్‌– క్రాంపన్స్‌ బృందంతో పాటుగా అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి సురక్షితంగా బేస్‌ క్యాంప్‌కు తిరిగి చేరుకున్నాడు. 22,837 అడుగుల (6,961 మీటర్లు) ఎత్తులో ఉన్న అకాన్కాగువా పర్వతం ఆసియా వెలుపల ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. అక్కడి వాతావరణం విపత్కంగా ఉండటంతో పాటు అధిక గాలులు, విపరీతమైన చలి తన లక్ష్యానికి కఠిన సవాలుగా నిలిచిందని విశ్వనాథ్‌ తెలిపాడు. అర్జెంటీనాలోని ఆండీస్‌ పర్వత శ్రేణిలోని ఈ శిఖరం భూతలానికి అత్యంత ఎత్తైన శిఖరం. 

ఖండాంతరాలను దాటి.. 
మౌంట్‌ అకాన్కాగువానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాలు.. డెనాలి (ఉత్తర అమెరికా), ఎల్బ్రస్‌ (యూరప్‌), కిలిమంజారో (ఆఫ్రికా), కోస్కియుస్కో (ఆ్రస్టేలియా), విన్సన్‌ మాసిఫ్‌ (అంటార్కిటికా), ఐస్‌లాండ్‌ పీక్‌ (నేపాల్‌), భారత్‌లోని కాంగ్‌ యాట్సే 1, 2 పర్వతాలతో పాటు డిజో జోంగో, ఫ్రెండ్‌షిప్‌ పీక్, కాలా పత్తర్, ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ వంటి వాటిని ఇప్పటికే అధిరోహించి చరిత్ర సృష్టించాడు. 

తన తదుపరి లక్ష్యం ఎవరెస్ట్‌ పర్వతం (29,032 అడుగులు)అని, ఈ లక్ష్యాన్ని ఈ ఏడాది మేలో పూర్తిచేయడానికి సన్నద్ధమవుతున్నానని పేర్కొన్నాడు. ఈ లక్ష్యాన్ని చేరుకుని యువ సాహాసికులకు విశ్వనాథ్‌ స్ఫూర్తిగా నిలవనున్నాడని శిక్షకులు భరత్‌ తమ్మినేని సంతోషం వ్యక్తం చేశారు.   

(చదవండి: వయసుకే వృద్ధాప్యం.. ! నవ యవ్వనంగా వయోధికులు..)

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)