Breaking News

లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ

Published on Tue, 12/03/2024 - 07:23

సాక్షి, సిటీబ్యూరో: గుడ్ మార్నింగ్ లండన్‌.. మీరు వింటున్నారు 98.8 స్పైస్‌ ఎఫ్‌ఎం.. అంటూ ఓ గొంతు ఉదయమే అందరినీ పలకరిస్తుంటుంది. గొప్ప వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తూ స్ఫూర్తిని నింపుతుంది. ప్రపంచ దేశాల్లోని శ్రోతలకు ఆ గొంతు ఒక వ్యసనం.. 

ఆ గొంతు విననిదే చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడమంటే ఆ గొంతు మన తెలుగు అబ్బాయిది కాబట్టి.. అదీ మన హైదరాబాదీ గొంతు కాబట్టి. ఆ గొంతుక పేరే భరత్‌ కల్యాణ్‌. ఉప్పల్‌కు చెందిన భరత్‌ పేరు యూకే, యూఎస్, కెనడా, భారత్‌తో పాటు అనేక దేశాల్లో రేడియో శ్రోతలకు వరల్డ్‌ ఫేమస్‌ అని చెప్పొచ్చు. వారం మొత్తం జాబ్‌ చేసుకుని.. వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్‌ చేయకుండా.. శనివారం అక్కడి స్పైస్‌ ఎఫ్‌ఎంలో ది కల్యాణ్‌ క్రానికల్స్‌ విత్‌ భరత్‌ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మందికి చేరువయ్యాడు.

ఉన్నత చదువుల కోసం వెళ్లి.. 
అందరు యువకుల్లాగే విదేశాలకు వెళ్లి ఎంఎస్‌ చేయాలనేది తన కోరిక. ఎలాగోలా యూకేలోని న్యూక్యాసిల్‌ వెళ్లి ఎంఎస్‌ పూర్తి చేశాడు. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ డెవలపర్‌గా మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ప్రజలతో మమేకం కావడమంటే చిన్నప్పటి నుంచి మనోడికి ఇష్టం. ఉద్యోగరీత్యా అది సాధ్యం కాదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఆన్‌లైన్‌ ఎఫ్‌ఎం స్టేషన్‌లో రేడియో జాకీ ఉద్యోగం ఉందని ప్రకటన చూసి దరఖాస్తు చేసుకోవడం.. మనోడి స్కిల్స్‌ చూసి సెలెక్ట్‌ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో సక్సెస్‌ అయిన వారి జీవిత విశేషాలు, సక్సెస్‌ జర్నీని శ్రోతలకు పరిచయం చేస్తూ స్ఫూర్తి నింపుతున్నాడు. అలా మన తెలుగు వారిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. 2014 యూపీఎస్సీ టాపర్‌ ఇరా సింఘాల్‌ ఇంటర్వ్యూ ఎంతో ఇష్టమని భరత్‌ చెప్పాడు. గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు పది మందితో పంచుకుంటుంటే.. ఎంతో మంది తనకు ఫోన్‌ చేసి మెచ్చుకుంటుంటే ఆ తృప్తే వేరని పేర్కొంటున్నాడు. ఇక, తాను పనిచేసే ఎఫ్‌ఎం దక్షిణాసియా దేశాలకు చెందిన వారు నడుపుతున్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఎంతో సోదరభావంతో పనిచేస్తుంటామని, ఎలాంటి బేధాలు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుందని వివరించాడు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)