Breaking News

అలా అనుకున్నాడు... సుందరం ఇలా అయ్యాడు... పాపం!

Published on Sat, 03/28/2026 - 10:49

హైదరాబాద్‌లోని బోరబండ చౌరస్తా దాటి వెళుతున్న సుందరం దృష్టి ఒక మూలన ఉన్న చెత్తకుప్పపై పడింది. ఆ చెత్తకుప్పపై మెరుస్తున్న దీపం ఒకటి కనిపించింది.

‘కొంపదీసి... ఇది అల్లావుద్దీన్‌ అద్భుతదీపం అయితే కాదు కదా!’ అనుకున్నాడు మనసులో.
‘యస్‌’ అనే మాట నలుమూలలా రీసౌండ్‌ ఇచ్చింది.
పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్లి ఆ దీపాన్ని చేతిలోకి తీసుకున్నాడు సుందరం.
‘కమాన్‌... టెల్‌మీ... ఏం కావాలో కోరుకో’ అని అడిగింది దీపంలోని జిన్నీ భూతం.
‘ఎన్ని కోరికలైనా కోరుకోవచ్చా?’ ఆత్రంగా అడిగాడు సుందరం,
‘యస్‌’ అని చెప్పింది జిన్నీ.
...సుందరం తన కోరికల చిట్టా విప్పాడు.
‘నాకు ప్రపంచంలో ఏ భాష అయినా తెలిసి ఉండాలి’ అడిగాడు సుందరం.
జిన్నీ: ఓకే.
‘నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. కానీ వేయడం రాదు. నేను ఏ బొమ్మ అయినా స్పీడ్‌గా గీసేలా వరం ఇవ్వు’
జిన్నీ: ఓకే
పోరపాట్లు చేయడం తప్ప నాకు సలహాలు ఇవ్వడం రాదు. ఎవరు ఏ సలహా అడిగినా సలహా ఇచ్చే శక్తి ఇవ్వు’
జిన్నీ: ఓకే
సుందరం:
‘ఎవరి గొంతునైనా ఈజీగా ఇమిటేట్‌ చేయాలి’
‘పాటలు అలవోకగా రాసే టాలెంట్‌ ఇవ్వు’
‘సినిమాలకు స్క్రీన్‌ప్లే  రాసే టాలెంట్‌ ఇవ్వు’
‘సినిమా కథలు రాసే టాలెంట్‌ ఇవ్వు’
‘పుస్తకాలు రాసే టాలెంట్‌ ఇవ్వు’
‘అద్భుతమైన గ్రాఫిక్స్‌ సృష్టించే టాలెంట్‌ ఇవ్వు’
‘అద్భుతమైన ప్రేమ లేఖలు రాసే అదృష్టం ఇవ్వు’
‘ఏఐ గురించి నాకు బొత్తిగా తెలియదు. అలాంటి నాకు ఏఐ క్లాసులు చెప్పే శక్తి ఇవ్వు’
‘నేను అందంగా లేకపోయినా చాలా అందంగా కనిపించే వరం ఇవ్వు’
జిన్నీ: ఓ... ఓ... ఓ...
కట్‌ చేస్తే....
బోరబండ వాసి అయిన సుందరం అక్కడెక్కడో అమెరికాలోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘ఓపెన్‌ ఏఐ’లో చాట్‌బాట్‌గా మారిపోయాడు!!!!!
‘ఇది అన్యాయం, అక్రమం, దారుణం, దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధం, శోచనీయం, గర్హనీయం, అమానవీయం, ఆక్రోశనీయమ్‌’..... అంటూ ఏడుపు అందుకున్నాడు సుందరం.
అప్పుడు జిన్నీ భూతం ప్రత్యక్షమై... ‘నువ్వు ఏం కోరుకున్నావో... అవన్నీ  చాట్‌జీపీటీ చేస్తుంది. అందుకే ఆల్‌ ఇన్‌ వన్‌గా చాట్‌జీపీటిగా మార్చాను’ అని చావు న్యూస్‌ చల్లగా చెప్పి మాయమైంది.
– యాకుబ్‌ పాషా 

#

Tags : 1

Videos

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు

2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

అమెరికా సంచలన ప్రకటన ఇరాన్ పని ఖతం!

అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Photos

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)