Breaking News

మానవ సేవే.. మాధవ సేవగా... మహ్మద్‌ నజీబ్‌ సేవలు!

Published on Tue, 03/11/2025 - 13:11

మానవ సేవే మాధవ సేవ.. అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ నజీబ్‌. సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ.. నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ఆర్గనైజేషన్‌ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహ్మద్‌ నజీబ్‌ షేక్‌పేట ఫ్రెండ్స్‌ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం వంద కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్‌ అడ్డాలు, ఆస్పత్రుల వద్ద భోజన ప్యాకెట్లు అందించారు.  – గోల్కొండ 

నజీబ్‌ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్‌ పేటలో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహ్మద్‌ నజీబ్‌. స్థానిక ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ.. తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్‌ అడ్డాల వద్ద ఒక్కపూట భోజన సదుపాయాన్ని  కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంట శాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్లను ఉచితంగా అందించాడు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు. 

కుటుంబ కలహాలు చక్కబెడుతూ..  
టోలిచౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్యా భర్తల కలహాలకు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 యేళ్లగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోడానికి తనవద్దకు వచి్చన వారికి కౌన్సిలింగ్‌ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్‌ ఇప్పించి, వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్‌ ద్వారా తామున్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి యేటా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని, పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజేషన్‌ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్‌ తెలిపారు.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)