Breaking News

హైదరాబాద్ బిర్యానీ కోసం అమెరికా నుంచి వచ్చేశా..!

Published on Sun, 04/19/2026 - 07:34

హైదరాబాద్‌ బిర్యానీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ రుచి కోసమే ఎంతో మంది సెలబ్రిటీలు ఉవి్వళ్లూరుతుంటారు. నగరానికి వస్తే బిర్యానీ రుచిని ఆస్వాదించకుండా ఉండరు. ఈ క్రమంలోనే.. ‘నేను కేవలం బిర్యానీ తినడానికే హైదరాబాద్‌కు విమానంలో వచ్చాను’ అనే క్యాప్షన్‌తో ఓ యూట్యూబర్‌ వీడియో అప్‌లోడ్‌ చేస్తే దానికి ఏకంగా దాదాపు 5.1 మిలియన్ల పైగా వీక్షణలు వచ్చాయి. నగరం వైపు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న అంశాల్లో హైదరాబాదీ క్యుజిన్‌ టాప్‌లో ఉందనే విషయాన్ని ఇది నిరూపిస్తుంది. 

ప్రస్తుతం యూట్యూబ్‌ లేదా ఇన్‌స్ట్రాగాంలో ’హైదరాబాద్‌’ అని సెర్చ్‌ చేస్తే.. బిర్యానీ, బన్‌ మస్కా, లేదా జూబ్లీహిల్స్‌ కేఫ్‌లోని మరో ఫ్యూజన్‌ డిష్‌.. తదితర వీడియోలతో స్క్రీన్‌ నిండిపోతుంది. ఒకప్పుడు చార్మినార్ లాంటి చారిత్రక నిర్మాణాలు దర్శనమిచ్చే చోట ఇప్పుడు హైదరాబాదీ క్యుజిన్‌ చవులూరిస్తోంది. 2019లో హైదరాబాద్‌కు యునెస్కో ద్వారా క్రియేటివ్‌ సిటీ ఆఫ్‌ గ్యాస్ట్రోనమీ హోదా లభించింది. ఈ హోదా, చారిత్రక రుచిని ఆస్వాదించేవారు తప్పక సందర్శించాల్సిన స్థలంగా నగరాన్ని  ప్రాచుర్యంలోకి తెచి్చంది. దీంతో నవతరపు పర్యాటకుల అభిరుచుల్లో.. నగర చారిత్రక, వాస్తు నిర్మాణ కళల కన్నా మన పాకశాస్త్ర కళలే కొంత ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 

సోషల్‌లో హల్‌చల్‌.. 
‘నేను కేవలం బిర్యానీ తినడానికే ఇక్కడికి విమానంలో వచ్చాను’ అని ఇటీవలే నగరాన్ని సందర్శించిన ప్రముఖ యూట్యూబర్‌ డైలీ మాక్స్‌ ప్రకటించారు. అలాగే.. తమ జాబితాలో ఒక ప్రసిద్ధ వంటకాన్ని పూర్తి చేయాలనే నిర్దిష్ట ఉద్దేశ్యంతో నగరానికి  ప్రయాణించినట్టు మరో ప్రముఖ జంట, అల్ఫోన్సో  జెస్సికాల వ్లాగ్‌ చూపిస్తుంది. మరో యూ ట్యూబర్‌ క్రిస్‌ లూయిస్‌ హైదరాబాద్‌ వంటల ప్రపంచం గురించి దఫాలుగా అనేక వీడియోలను రూపొందించారు. ఇక ముంబైకి చెందిన చెఫ్‌ వెల్టన్‌ సల్దానానే  ఇటీవల తన బిర్యానీ భక్తితో వార్తల్లో నిలిచారు. ఆయన నగరం నుంచి తిరిగి వెళుతూ రూ.5000 విలువైన బిర్యానీ ప్యాకెట్లను తీసుకెళ్లారు. అయితే.. దీని కోసం ఆయన విమానాశ్రయంలో రూ. 4,200 రుసుము సర్‌చార్జిగా చెల్లించారు. దీంతో ఆయన బిర్యానీ ప్యాకెట్లు రూ.9,200 ఖర్చు చేసినట్టయింది.  

లైఫ్‌స్టైల్‌ కంటెంట్‌ క్రియేటర్లు సైతం.. 
కేవలం ఫుడ్‌ బ్లాగర్లే కాకుండా, లైఫ్‌స్టైల్‌ కంటెంట్‌ క్రియేటర్లు కూడా హైదరాబాద్‌ ఆహార సంస్కృతి వ్యాప్తికి కారణమవుతున్నారు. మానవ సంబంధాలపై దృష్టి సారించే దుబాయ్‌కు చెందిన అంతర్జాతీయ కథకుడు ఖలీద్‌ అల్‌ అమెరి, ‘భారతదేశంలోనే అత్యుత్తమ బిర్యానీ‘ని కనుగొనడానికి నగరంలో తాను చేసిన తన 72 గంటల ప్రయాణం పంచుకున్నారు. ఇక ప్రముఖ నటుడు యూట్యూబర్‌ కూడా అయిన ఆశిష్‌ విద్యార్థి నగరంలోని ఆహార అభి‘రుచుల’ను ఆస్వాదిస్తారు. తెల్లవారు జామున పాయా, నహారీ తినే ఆచా రాన్ని అనుసరించేందుకు హోటల్‌ నయాబ్‌ ను సందర్శించడం  ఒక మరపురాని అనుభవ ంగా ఆయన వర్ణిస్తారు. దాదాపు ప్రతీ వారం ఒక హైదరాబాద్‌ ఫుడ్‌ పోస్ట్‌ వైరల్‌ అవుతుండడం కనిపిస్తోంది. అలా చూస్తే త్వరలోనే మన దేశపు ఫుడ్‌ టూరిజమ్‌కి భాగ్యనగరం కేరాఫ్‌గా నిలవడం తథ్యం అనిపిస్తోంది.   

Videos

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)