Breaking News

మూడు ముళ్లెందుకు గుచ్చుకుంటున్నాయి?

Published on Thu, 06/26/2025 - 06:12

‘మగాళ్లు, ఆడాళ్లు ఇద్దరూ సమానమే.. కానీ మగాళ్లు ఇంకొంచెం ఎక్కువ సమానం!’ ‘రాధాగోపాలం’ సినిమాలో డైలాగ్‌! ‘భార్యభర్తలిద్దరూ సమానమే అయితే భర్త ఇంకొంచెం ఎక్కువ సమానం’ అని సంసారంలో ఉన్న మాటను ఇప్పటి తరం అంటే అమ్మాయిలు అంగీకరించే పరిస్థితిలో లేరు! ఈ మాట వినపడగానే పెద్దలు, సంప్రదాయవాదులు అందుకే మనమూ పాశ్చాత్యుల్లా విడాకులకు తెగబడుతున్నాం అనేస్తారు ఘాటుగా!

ఇంతకీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర విడాకుల సంఖ్య ఎంతో తెలుసా.. కేవలం ఒక్క శాతమే! అంతదానికే ఇంత ఘాటా? అంటే కుటుంబ వ్యవస్థకు పునాది వివాహ వ్యవస్థగా మన్ననలు అందుకుంటున్న దేశం కదా! అలాంటి సమాజంలో ప్రపంచంతో పోలిస్తే తక్కువే అయినా విడాకుల సంఖ్య పెరుగుతుండటం, అందుకు అనుమతులు వస్తుండటం ఆందోళన కలిగించే అంశమే కదా! ఈ నేపథ్యంలో  మన పెళ్లి వ్యవస్థ బీటలు వారుతోందా? నివారోణాపాయం ఏంటి... వంటి అంశాల మీద నేటి నుంచి వరుస కథనాలు.  

ఈ రోజు..  పెళ్లి, అది ప్రమోట్‌ చేస్తున్న, డిమాండ్‌ చేస్తున్న అంశాలేంటో చూద్దాం! ఇదివరకు.. ఆడపిల్లకు ఉత్తరం చదివే అక్షరజ్ఞానం ఉంటే సరిపోతుందని అంతవరకే అనుమతించారు. తర్వాత ఆ ఆలోచన కాస్త మారి అమ్మాయి తన పిల్లలకు చదువు చెప్పుకునేంత జ్ఞానం సంపాదించాలని ఆ అనుమతిని కాస్త సడలించారు. ఇప్పుడు అమ్మాయిలు ప్రొఫెషనల్‌ డిగ్రీలు, పీహెచ్‌డీలూ చేసి, అబ్బాయిలు ఏయే రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో తమ ఉనికినీ చాటుకుంటున్నారు. అబ్బాయిలతో సమానంగా శ్రమించి సమాన వేతనాల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. సమానత్వ సాధనలో ఇది శుభపరిణామం. కానీ ఇదే పెళ్లిని బ్రేక్‌ చేస్తోందని సంప్రదాయ వాదుల భావన. 

ఎందుకంటే...
అక్షరజ్ఞానం నుంచి ఆఫీస్‌లకు చేరుకునేదాకా ఆడవాళ్ల ప్రగతిని ఆంక్షలు, హద్దులతో అయినా అంగీకరించిన సమాజం కనీసం స్థాయిలో డొమెస్టిక్‌ లేబర్‌లో పురుషుల భాగస్వామ్యాన్ని అంగీకరించలేకపోతోంది. ఆ ప్రగతికి సమాన నిష్పత్తిలో డొమెస్టిక్‌ లేబర్‌లో పురుషుల పాత్ర పెరగలేదు. అంటే పెళ్లి ఆ బాధ్యతను పూర్తిగా ఇంకా స్త్రీల భుజాన్నే మోపుతోంది. భార్యాభర్తలు పేరెంట్స్‌గా మారినా భర్త మీద పెద్దగా భారం పడట్లేదు. తల్లయిన భార్యకు మాత్రం క్రమంగా విశ్రాంతి తగ్గిపోతోందని, పిల్లలు పుట్టగానే నిద్ర నుంచి కెరీర్‌ వరకు తల్లే త్యాగం చేయాల్సి వస్తోందని అధ్యయనాల సారం. పేరెంటింగ్‌ సమస్య కాదు.

 మ్యారేజ్‌లో పేరెంటింగ్‌ని కేవలం తల్లి బాధ్యతలా పరిగణించడమే సమస్య, ఆ మాటకొస్తే పెళ్లిలోని ప్రేమ, విధేయత, కమిట్‌మెంట్‌తో కూడా ప్రాబ్లం లేదు. పెళ్లి నిర్మాణమే అసలుప్రాబ్లం’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు. అందుకే సాధికారత సాధించిన యువతలు ఆర్థిక, సామాజిక భద్రతకో, ఓ ఇంటి వారవడం కోసమో పెళ్లి చేసుకునే స్థితిలో లేరు. పురుషులతోపాటు స్త్రీలకూ అంతేప్రాధాన్యం, గౌరవం ఇస్తూ భాగస్వామ్యానికి అసలైన నిర్వచనంగా ఉండే బంధాన్ని కోరుకుంటున్నారు. ఆ ఫ్రేమ్‌లో లేని పెళ్లిని త్యజించడానికి సిద్ధపడుతున్నారు. 

ఆనందం పంచలేని బంధానికి విడాకులనివ్వడానికీ  వెనుకాడటం లేదు. సంప్రదాయం కన్నా మానసిక ఆరోగ్యం, భద్రతకేప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని కుటుంబం గ్రహించాలి. పిల్లల పెంపకం నుంచే జాగ్రత్త వహించాలి. చదువు విషయంలో అమ్మాయి, అబ్బాయి పట్ల చాలావరకు సమానత్వం చూపిస్తున్న తల్లిదండ్రులు ఇంటి పనుల విషయంలోనూ ఆ సమానత్వాన్ని ప్రదర్శించాలి. ఎందుకంటే అక్కడ అమ్మాయిలకు వెసులుబాటు దొరికితేనే వారి సాధికారతకు సార్థకత చేకూరుతుంది. ఇప్పటికిప్పుడు తల్లిదండ్రులు డొమెస్టిక్‌ లేబర్‌లోనూ అబ్బాయిలకు వాటా ఇస్తే భవిష్యత్‌ తరానికి అది నార్మలైజ్‌ అవుతుంది. 
 

సమాజంలో జరుగుతున్నదాన్ని అందరికీ ఆపాదించలేం. ఎవరి జీవితం వాళ్లది.. ఎవరి ఎక్స్‌పీరియెన్స్‌ వాళ్లది. పెళ్లి విషయంలోనూ అంతే! పెళ్లి కావాలనుకున్నా వద్దనుకున్నా అది వాళ్ల వ్యక్తిగత చాయిస్‌. అలాగే విడాకుల విషయంలోనూ అంతే! కలిసి ఉందామనుకున్నా, వద్దనుకున్నా ఆ జంట నిర్ణయం. అయితే ఆ చాయిస్‌కి కానీ, నిర్ణయాలకు కానీ సమాజంలో స్పేస్‌ ఉండాలి. 
– ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌

‘నాకిప్పుడు 59 ఏళ్లు. శారీరకంగా, మానసికంగా నానా అవస్థలు పడుతూ సినిమాల్లో పనిచేస్తున్నాను. పెళ్లి పేరుతో నా జీవితంలోకి వచ్చిన భాగస్వామి ఏ కారణంతో విడిపోయినా భరణం కింద నా కష్టార్జితంలో సగానికి ఎసరుపెడుతుంది. యంగ్‌ ఏజ్‌లో పెళ్లయితే పర్లేదు.. అవతలి వాళ్లు మనోవర్తి కింద ఎంత డబ్బు తీసుకున్నా మళ్లీ సంపాదించుకోగలమనే నమ్మకం ఉంటుంది. కానీ ఈ వయసులో? అదంతా ఎక్కడ పెట్టుకోను? అందుకే ఇలా గడచిపోతోంది గడచిపోనివ్వండి’ 
– సల్మాన్‌ ఖాన్, బాలీవుడ్‌ నటుడు

– సరస్వతి రమ

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)