నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
Breaking News
బెగ్గర్ రోబో!
Published on Tue, 06/30/2026 - 06:30
చైనాలోని ఒక హ్యూమనాయిడ్ రోబో తన కరెంట్ ఖర్చుల కోసం వీధిలో యాచిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో...ఒక రోబో ఫుట్‌పాత్‌పై మోకాళ్లపై కూర్చొని అటుగా వెళ్తున్న వారికి వంగి నమస్కరిస్తూ యాచిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. రోబో పక్కన విరాళాల కోసం ఒక ట్రేతో పాటు, క్యూఆర్ కోడ్ ఉంటుంది.దీనికి తోడు ఎల్ఈడీ డిస్ప్లే, లౌడ్‌స్పీకర్ కనిపిస్తాయి.
‘రీచార్జ్ చేయడానికి డబ్బులు లేవు. దయచేసి సహాయం చేయండి’ అంటూ లౌడ్‌స్పీకర్ నుంచి పదేపదే వినిపిస్తూ ఉంటుంది. ఇది మార్కెటింగ్ స్టంటా? విరాళాలను ఆకర్షించే సృజనాత్మక మార్గమా? అని చాలామంది నెటిజనులు ప్రశ్నించారు. ‘మంచి ఆలోచన. మీరే స్వయంగా అడుక్కోవడానికి బదులుగా ఆ పనిని రోబోతో చేయించండి. ఇది సమయాన్ని, శక్తిని రెండిటినీ ఆదా చేస్తుంది’ అని ఒక నెటిజనుడు రాయడమే కాదు ‘నేను కూడా ఇదే మార్గం అనుసరించాలనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించాడు!
Tags : 1