Breaking News

ఒకప్పుడు... ఎటు చూసినా చెత్తే ఇప్పుడు... ఎటు చూసినా పచ్చదనమే!

Published on Thu, 08/07/2025 - 10:29

ఒకప్పుడు యూపీలోని నోయిడాలో డంపింగ్‌ గ్రౌండ్‌ల చుట్టుపక్కల నివసించే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఇన్నీ అన్నీ కావు. అపరిశుభ్రత రాజ్యమేలే ఆ ప్రదేశాల సమీపంలో నడవాలంటే దుర్వాసన భరించడం కష్టంగా ఉండేది. చెత్తపడేసేవాళ్లకు, చుట్టుపక్కల వాళ్లకు ఎప్పుడూ ఏవో తగాదాలు జరుగుతూనే ఉండేవి. ఈ పరిస్థితిలో సమూలంగా మార్పు తీసుకురావడానికి సేఫ్‌ (సోషల్‌ యాక్షన్‌ ఫర్‌ ఫారెస్ట్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌) అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సమూల మార్పు తీసుకువచ్చాడు విక్రాంత్‌ టోంగాడ్‌. 

‘ఈ స్థలం ఇక ఎందుకు పనికి రాదు’ అనుకున్న స్థలాన్ని పచ్చదనంతో కళకళలాడేలా చేశాడు.  దీనికి ముందు ఘజియాబాద్‌లో వ్యర్థాలు పడేసే ప్రదేశాలను ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా మార్చాడు. స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యం, సీఎస్‌ఆర్‌(కార్పోరెట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) ఫండింగ్‌తో చెత్త వేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అనుకున్న పది ఎకరాల స్థలంలో వ్యర్థాలు లేకుండా చేశాడు. వందల కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్‌కు ఉపయోగించాడు. 

ప్లాస్టిక్‌ బెంచీలు తయారుచేయించాడు. మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. రెండు మూడు సంవత్సరాల వ్వవధిలో ఎక్కువ చెట్లు పెంచేలా జపనీస్‌ ‘మియావాకీ మెథడ్‌’ను అనుసరించాడు. ‘ఒక్కడే కష్టపడుతున్నాడు’ అన్నట్లుగా ఉండేది ఒకప్పుడు విక్రాంత్‌ పరిస్థితి. అయితే స్థానికులు అతడికి తోడయ్యారు. దీంతో విక్రాంత్‌ పని సులువు అయింది. ఒకప్పుడు ‘ఎటు చూసినా చెత్తే’ అన్నట్లుగా ఉండే ప్రదేశాలు ఇప్పుడు ‘ఎటు చూసినా పచ్చదనమే’ అన్నట్లు మారాయి. 

 

(చదవండి: ఈ పక్షుల విడాకుల గురించి ముందే తెలిసిపోతుంది!)
 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)