Breaking News

ఇలా చేస్తే..కేవలం 24 గంటల్లో జలుబును తగ్గించుకోవచ్చు

Published on Wed, 12/20/2023 - 12:48

జలుబు వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. ఇప్పటివరకు జలుబును తగ్గించేందుకు ఎలాంటి ఇన్‌స్టంట్‌ మెడిసిన్స్‌ లేవు. కొందరికి వారం రోజుల్లో తగ్గితే, మరికొందరికి నెల రోజులైనా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.

పెద్దలకు ఏడాదిలో మూడు సార్లు, చిన్నపిల్లలకు అయితే ఏడాదిలో పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు జలుబుతో బాధపడుతుంటారని ఓ అధ్యయనంలోవెల్లడైంది. ఎలాంటి మెడిసిన్స్‌ వాడకుండానే ఇంట్లోనే దొరికే వస్తువులతో కేవలం 24 గంటల్లో జలుబుకు చెక్‌ పెట్టొచ్చు ఇలా..


►ఏ కాలంలో అయినా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది చలికాలంలో సరిగా నీళ్లు తాగరు. ఇలా అస్సలు చేయకూడదు. జలుబు చేసినప్పుడు తేనెతో కలిపిన నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

► వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి.

► తేనె, నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి.

► అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి.

► ఒక గ్లాసు నీళ్లలో పావు స్పూన్‌ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు కలిపిన నీళ్లతో బాగా పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జింక్ లాజెంజెస్ అనే పెప్పర్‌మెంట్స్‌ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి జలుబును చాలా త్వరగా తగ్గించగలవు. ఇందులో బెర్రీ, లెమన్‌.. ఇలా చాలా ఫ్లేవర్స్‌ ఉంటాయి. అయితే మీరు యాంటీబయాటిక్స్‌ వాడితే మాత్రం తప్పకుండా డాక్టర​్‌ను సంప్రదించి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, బాదం, చేపలు వంటి వాటిల్లోనూ జింక్‌ అధికంగా ఉంటుంది. జలుబులో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. 

► బీట్‌రూట్ జ్యూస్‌లో డైటరీ నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరపు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబుతో బాధపడుతున్న 76మందిలో.. రోజుకు ఏడు కంటే ఎక్కువసార్లు బీట్‌రూట్‌ తాగిన వారిలో జలుబు లక్షణాలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 

► టాబ్లెట్లల కంటే నాజిల్‌ స్ప్రేలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి జలుబు తాలూకూ బాక్టీరియాను చంపి ఇన్‌స్టంట్‌ రిలీఫ్‌ ఇవ్వగలదు.
వీటితో పాటు జలుబు అటాక్‌ అయినప్పుడు సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లే తాగితే బెటర్‌. ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది విశ్రాంతి. ట్యబ్లెట్స్‌ వేసుకున్నా, హోమ్‌ రెమిడీలు ట్రై చేసినా సరైన విశ్రాంతి తీసుకున్నప్పుడే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)