Breaking News

జుట్టు బాగా రాలుతుందా? ఉసిరి, క్యారెట్‌తో ఇలా చేస్తే..

Published on Tue, 12/19/2023 - 16:21

ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్‌ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్‌మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

ఉసిరి
ఇండియన్‌ గూస్‌బెర్రీగా పిలిచే ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధికమొత్తంలో విటమిన్‌  ఇ , విటమిన్‌  ఉ, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి.ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి.ఇందుకోసం ఏం చేయాలంటే..ఉసిరికాయను ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి.

ముక్కలు ఆరిన తరువాత పొడిచేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి పొడి 2 టేబుల్‌ స్పూన్స్‌ తీసుకుని దానిలో నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా చేసుకుని స్కాల్ప్‌పై అఫ్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుని రెండు గంటల పాటు ఉంచుకుని ఆ తరువాత షాంపు, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది.

క్యారెట్‌
క్యారెట్‌లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌ ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడమేగాక, వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. క్యారెట్‌ జ్యూస్‌ తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. అందువల్ల 100 మిల్లీ లీటర్ల క్యారెట్‌ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతాయి.

స్వచ్ఛమైన కొబ్బరి నూనె
కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్‌ యాసిడ్‌ కేశాలను ధృడంగా ఉంచడంలో సాయపడుతుంది. వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది. కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు పెరుగుతాయి. అంతేకాకుండా 15–20 నిమిషాలపాటు కొబ్బరినూనెతో స్కాల్ప్‌ మర్దన చేసి ఒక గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆతరువాత షాంపుతో వాష్‌ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 

పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన డైట్‌ పాటించడంతో పాటు యోగా, ధ్యానం, వర్కౌట్ చేయాలి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)