Breaking News

అప్పడాలు ఇలా తింటే ఆరోగ్యమే..!

Published on Thu, 05/22/2025 - 16:30

భోజనంలో సైడ్‌ డిష్‌గా కరకరలాడే అప్పడాలు ఉంటే అబ్బో ఆ భోజనం పొట్ట ఫుల్‌గా మనసు నిండుగా ఉంటుంది. అబ్బా.. తలుచుకుంటేనే నోరూరిపోయే ఈ అప్పడాలను ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్నాపెద్ద అనే తేడాలేకుండా ఎంతో ఇష్టంగా తినే అప్పడాలు వాస్తవానికి అంత ఆరోగ్యకరమైనవి కాదు. వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌​ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులు అస్సలు తినకూడదు. అయితే అప్పడాలు వేయించిన ఘుమఘమకి నోరూరిపోతుంటుంది. తినకుండా ఉండాలంటే చాలా కష్టమే. అలాంటివాళ్లు వాటిని మిస్‌ చేసుకుంటున్నాం అనే బాధ లేకుండా హాయిగా తినే చక్కటి మార్గం ఏంటో.. పోషకాహార నిపుణుల మాటల్లో తెలుసుకుందామా..!.

మెటబాలిక్ హెల్త్ కోచ్ కరణ్ సారిన్ అప్పడాలంటే ఇష్టపడని వారెవరుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆరోగ్యకరంగా తినడం తెలిస్తే చాలు..అని అంటున్నారు. సాధారణంగా మినపప్పుతో చేసే ఈ అప్పడాలు డీప్‌ ఫ్రై చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారని అన్నారు. అయితే మినపప్పు ఆరోగ్యానికి మంచిదే అయినా..ఇందులో వినియోగించే మసాలా, సోడియం, కార్బోహైడ్రేట్‌ కంటెంట్‌ ఎక్కువ. అందువల్ల ఇది ఆరోగ్యానికి అంత మంచికాదని తేల్చి చెప్పారు. 

అదీగాక దీనిలో ‍గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకుంటే రక్తంలో చక్కెర స్తాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందట. అయితే కాస్త తెలివిగా పరిమిత ప్రమాణంలో ఆరోగ్యకరంగా తింటే ఎలాంటి సమస్య ఉండదని నమ్మకంగా చెబుతున్నారు న్యూటిషనిస్ట్‌ కరణ్‌. అంతేగాదు అదెలాగా ప్రయోగాత్మకంగా వీడియో రూపంలో చూపించారు కూడా. 

ఇది శుద్ధి చేసిన పిండే అయినప్పటికీ దీనిలో చక్కెర శాతం ఉండదు. కానీ ఇందులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(GI) మాత్రం ఎక్కువే. అందుకని దీన్ని కూరగాయలు, సలాడ్‌ల రూపంలో తీసుకుంటే హెల్దీగా ఉంటుందట. అలా ఆయన స్వయంగా తిని చూపించారు. 

అంతేగాదు రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా సమస్థాయిలో ఉన్నాయో స్పష్టంగా చూపించారు. దీన్ని చిరుతిండిలా ఉల్లిపాయలు, టమోటాలు, దోసకాయ, వంటి అధిక ఫైబర్‌ టాపింగ్స్‌తో జత చేసి హాయిగా తినేయొచ్చని అంటున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అప్పడాలను ఇలా హెల్దీగా తినేయండి.

 

(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్‌ 900 ఎగ్స్‌ డైట్‌..! చివరికి గంటకు పైగా..)
 
 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)