Breaking News

ఛిద్రమవుతున్న బాల్యం

Published on Thu, 10/16/2025 - 11:56

18 ఏళ్ల లోపు బాలబాలికలను లైంగిక నేరాల నుండి రక్షించడానికి రూపొందించిన పోక్సో చట్టం 2012 (POCSO Act 2012)నవంబర్‌ 14 నుండి అమల్లోకి వచ్చింది. నేరస్థుడు పురుషుడు, మహిళ లేదా మూడవ జెండర్‌ కూడా కావచ్చు. కేంద్ర న్యాయ శాఖ వెబ్‌సైట్‌ ప్రకారం దేశంలో 725 కోర్టులు ఈ కేసులను విచారిస్తున్నాయి, 2 లక్షల పైగా కేసులు పెండింగులో ఉన్నాయి, ఇప్పటి వరకూ 3,34,213 కేసులు పరిష్కారమైనాయి. బంధు వులు, పొరుగింటివారు, యజమానులు, బాగా పరిచయమున్నవారు కూడా బాలలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారని జరుగు తున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పోలీసుల దాకా వెళ్ళకుండా నిందితులతో రాజీ చేసుకునే కేసులు, నిందితు లకు భయపడి మౌనంగా ఉండే కేసులు ఎన్నో ఉంటాయి. ఈ నేరాన్ని ప్రేరేపించిన వారు కూడా నిందితులు అవుతారు. నేరం రుజువైతే జీవిత ఖైదు, మరణ శిక్షతో పాటు జరిమానాకు అర్హులు.

ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రత్యేక సెషన్స్‌ కోర్టుల ముందు ‘ఇన్‌ కెమెరా’ పద్ధతిలో విచారణ జరుగుతుంది. నేర అభియోగపత్రం రిజిస్టరైన తేదీ నుండి ఏడాది లోపులో తీర్పు వెలువరించాలని చట్టం చెప్తోంది. ఎగతాళి, సామాజిక బహిష్కరణ, వేధింపుల నుండి నివారణ కోసం లైంగిక వేధింపులకు గురైన బాలల పేరు, చిరునామా, ఫొటోలను బహిర్గతం చేయరాదు. బహిర్గతం చేసినట్లయితే ఏడాది పాటు శిక్షకు గురవుతారు. అంతెందుకు, విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం, అప్పిలేటు న్యాయస్థానం కూడా తమ తీర్పుల్లో బాధిత బాలుడు లేదా బాధిత బాలికగానే పేర్కొనాలి తప్ప పేరును బహిర్గతం చేయకూడదు. సాక్ష్యాలను నమోదు చేసే సమయంలో బాధిత బాలలు నింది తుడికి కనిపించకుండా ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకోవాలి. వీడియో కాన్ఫరె న్సింగ్, సింగిల్‌ విజిబిలిటీ మిర్రర్లు, పరదా లేదా ఏదైనా ఇతర పరికరాన్ని ఉపయోగించి, భయాందోళనలకు గురి కాకుండా స్నేహపూర్వక వాతావరణం కల్పించి పిల్లల వాఙ్మూలాన్ని రికార్డ్‌ చేయాలి. అదే సమయంలో నిందితుడు బాధిత బాలల వాఙ్మూలాన్ని వినగలిగే, అతని న్యాయవాదితో సంభాషించ గలిగే స్థితిలో ఉండాలి. ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సిన భారం నిందితుడి మీదే ఉండటం గమనార్హం. 

పిల్లలు, టీనేజర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వెబ్‌సైట్ల సంఖ్య పెరుగుతోంది. వీటి దుష్ప్రభావాల నుంచి రక్షించడంలో భాగంగా పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్‌ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తెచ్చింది. అలాంటిది తేవడానికి అవకాశం ఉందేమో మన ప్రభుత్వాలూ పరిశీలించాలి. చికిత్సకు ముందే వ్యాధి నివారణకై ఆలోచించటం ఉత్తమం.

-తడకమళ్ల మురళీ ధర్‌ విశ్రాంత జిల్లా జడ్జి

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)