Breaking News

రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్‌ కాంబో

Published on Thu, 09/26/2024 - 16:27

మిల్లెట్లతో చేసుకునే ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ముందుగా గుర్తొచ్చే వాటిల్లో ఒకటి రాగులు. రాగులు లేదా ఫింగర్‌ మిల్లెట్స్‌తో రక రకాల వంటకాలను చేసుకోవచ్చు.   ఇపుడు మాత్రం రాగిముద్దను ఎలా చేసుకోవాలో చూద్దాం.

చిరుధాన్యాల్లో అతి ముఖ్యమైన రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ ఎక్కువగా లభిస్తాయి.  కేలరీలు తక్కువ,  ఫైబర్‌ ఎక్కువగా కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి  ఇది మంచి ఆహారం.  గ్లూటెన్ లోపంతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా.

కావలసిన పదార్థాలు : 
రాగుల పిండి - 2 కప్పులు, నెయ్యి - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత

తయారీ
ముందుగా ఒక గిన్నెలో  రెండు కప్పుల నీళ్లను బాగా మరిగించాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి.  ఇంతలో రాగి పిండి కొద్ది నీళ్లు పోసి కలపుకావాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో  రాగి పిండిని  మెల్లగా వేయాలి. మిశ్రమం చిక్కగా బుడగలొస్తాయి. ఇపుడు మంటను పూర్తిగా తగ్గించి, మరికొంచెం పిండిని కలపాలి.  గట్టి చెక్క కర్ర లేదా గరిటె అయితే కలపడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ మంటతో నెమ్మదిగా కలుపుతూ ఉంటే పిండి ముద్దగా అవుతుంది. కావాలనిపిస్తే ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చల్లారాక చేతిలో నెయ్యి రాసుకుని నిదానంగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి.  అంతే రాగి ముద్ద రెడీ. పర్ఫెక్ట్‌గా చేసిన రాగి ముద్ద వేళ్లతో తాకినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. 

ఇదే తరహాలో మరికొందరు రాగుల పిండిలో నూకలు లేదా బియ్యంతో కలిపి కూడా  రాగిముద్ద లేదా సంకటి చేసుకుంటారు.

ఎలా చేసినా వేడి వేడి నాటుకోడి పులుసు, మటన్‌ సూప్‌తో రాగిముద్దను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు లేదా సాంబారు, గోంగూర పచ్చడి కాంబినేషన్‌ కూడా అదిరి పోతుంది. 
 

ఇదీ చదవండి:  భార్యామణికోసం ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన వ్యాపారవేత్త?!


 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)