పొద్దస్తమానం సోషల్‌ మీడియాలోనే!

Published on Thu, 11/21/2024 - 11:39

డాక్టరు గారూ! నా కూతురు వయస్సు 16 సంవత్సరాలు. తను ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోంది. అక్కడ ఎక్కువగా అబ్బాయిలతో చాట్‌ చేయడం, తన ఫోటోలు పెట్టడం చేస్తోంది. మేము ఆంక్షలు పెట్టినప్పుడు విపరీతమైన కోపాన్ని, భావోద్వేగాలను ప్రదర్శించడం, మందలిస్తేనేమో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం సాధారణం అయ్యాయి. ఈ మధ్య చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది. మీ సలహా కోసం ఎదురు చూస్తుంటాం. 
–స్రవంతి, మహబూబ్‌నగర్‌

మీరు పడుతున్న వేదన అర్థమవుతోంది. ఈ మధ్య ఇలాంటి సమస్యలను తరచూ గమనిస్తున్నాం. మీ అమ్మాయికి ఉన్న కండిషన్‌ని ‘బోర్డర్‌ లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ అంటారు. ఇందులోని ప్రధానమైన లక్షణాలు అస్థిరమైన సంబంధాలు, విపరీతమైన భావోద్వేగాలు ఆత్మహత్య బెదిరింపులు, ఆత్మహత్యా ప్రయత్నాలు. 

వీటికి తోడు మీరు చెప్పినట్టు స్నేహితులను మార్చడం, సంబంధాల స్వభావం కూడా ఈ సమస్యకి సంబంధించినవే! మీ అమ్మాయిని ఒక మంచి సైకియాట్రిస్టుకి చూపించి ఈ సమస్య కోసం వైద్య చికిత్స (మందులు) మానసిక చికిత్స (థెరపీ) ఇప్పించాలి. ‘డయలెక్టికల్‌ బిహేవియర్‌ థెరపీ’ ఆత్మ నియంత్రణను, మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. 

సోషల్‌ మీడియా వినియోగంపై నిర్దిష్ట నిబంధనలు పెట్టడం మంచి ఆలోచన. నిర్ణీతగంటల్లో మాత్రమే ఉపయోగించడం, ఖచ్చిత సమయానికి పరిమితం చేయడం వంటివి, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవలకు స్వచ్ఛందంగా సహాయం చేయడం తన పరిస్థితిని మెరుగు పరుస్తాయి.

ఆమెతో మాట్లాడేటపుడు తన భావనలను గౌరవిస్తూనే, తనకు సరైన గైడెన్స్‌ ఇవ్వండి. తన పరిస్థితి మెరుగుపడడానికి సమయం, సహనం అవసరం. అన్నింటికీ మించి మీ కుటుంబ సభ్యుల ప్రేమ ఎంతో అవసరం. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఆశాజనకంగా ఉండండి. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆల్‌ ది బెస్ట్‌. 

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

(చదవండి: లైఫ్‌ అంటే... పెళ్లి మాత్రమేనా?!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)