Breaking News

దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!

Published on Mon, 11/25/2024 - 13:46

చాలామంది భారతీయులు ఎక్కువగా విదేశాల్లోనే స్థిరపడుతున్నారు. ఇక అక్కడ ఉండే మన వాళ్లకు కొన్ని విషయాల్లో మన భారత్‌లో ఉన్నట్లు కుదరదు. ఆ దేశ నియమ నిబంధనలకు అనుగుణంగా మలసుకోక తప్పదు. అలాంటి వాటికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కంటెంట్‌ క్రియేటర్‌ శివీ చౌహాన్‌ నెట్టింట షేర్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌​ అవుతోంది. ఆమె ఆ వీడియోలో మన భారతీయ వంటకాల వాసనలు దుస్తుల నుంచి రాకూడదంటే ఏం చేయాలో.. కొన్ని చిట్కాలను షేర్‌ చేశారు.

మన భారతీయులు వంట చేయగానే కూర వాసన చూస్తారు. ఆ తర్వాత రుచి ఎలా ఉందో చూస్తాం. పైగా ఆ ఘుమ ఘుమలు వండిన వాళ్ల శరీరం నుంచి రావడం మాములే. కానీ పాశ్చాత్యా దేశాల్లో ప్రజల తీరు చాలా క్లీన్‌గా.. క్రమపద్ధతిలో ఉంటుంది. అక్కడ ఆహారాలన్నీ మన వంటకాల మాదిరి ఘుమఘుమలు రావు. 

అందువల్ల బట్టలకు గనుక కూర వాసన వస్తే చాలు వాళ్లు భారతీయులు అన్నట్లు గుర్తించడమే గాక అదోలా ముఖాలు పెట్టుకుంటారు కూడా. అందువల్ల ఆ వాసన రాకుండా కాస్త జాగ్రత్తలు తప్పనిసరి ఆ విషయాన్నే కంటెంట్‌ క్రియేటర్‌ శివీ చౌహాన్ నెట్టింట షేర్‌ చేసింది. తనకు కూడా అలా దుస్తుల నుంచి కూరల వాసన రావడం ఇష్టముండదట. 

అలా కర్రీ వాసన రాకుండా ఎలా జాగ్రత్తపడాలో కొన్ని చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది. మన భారతీయ వంటకాల్లో ఉల్లిపాయలు, మసాలాలు ఉంటాయి. వాటి ఘాటు వాసన దుస్తులను అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి వంట చేసేటప్పడు ధరించిన బట్టలనే బయటకు వెళ్లేటప్పడు ధరించొద్దని అంటున్నారు. అలాగే వంట చేసే సమయంలో జాకెట్లు ధరించకపోవడమే మంచిదని సూచించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఆమెది శ్వేతజాతీయుల భావన అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్‌ సర్వీస్‌ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!)
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)