Breaking News

Potato Rice ఆలూ రైస్‌.. పిల్లలు భలే తింటారు!

Published on Tue, 06/25/2024 - 16:14

దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల  సింపుల్‌గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా  టేస్ట్‌ అదిరి పోతుంది.  

బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్‌డ్‌ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు.  ఇపుడు మాత్రం  వెరైటీగా ఆలూ రైస్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్‌ అయినా పరవాలేదు) 
చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు  అరకప్పు
తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కొద్దిగా నెయ్యి, కొత్తిమీర

తయారీ
బియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.

ప్యాన్‌లో కొద్దిగా  నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక  కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక  తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్‌ చేసుకోవచ్చు.

బాగా వేగిన తరువాత  ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్‌ పొడిగా ఉంటుంది.  దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది. 
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)