Breaking News

బంగారంతో రోగాలు నయం.. డిప్రెషన్‌ కూడా దూరమవుతుంది

Published on Wed, 06/28/2023 - 15:55

బంగారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. యుర్వేద మందుల్లో బంగారంను నేరుగా ఉపయోగించకుండా.. బంగారంను భస్మంగా  మార్చి స్వర్ణ భస్మంలా వాడుతుంటారు. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

స్వర్ణ భస్మంలో 98శాంతం బంగారు రేణువులను కలిగి ఉన్నందున ఇది ఆయుర్వేదంలో అత్యంత ఖరీదైన ఔషధాలలో ఒకటిగా పేర్కొంటారు. నెయ్యి, తేనె లేదా పాలతో  కలిపి స్వర్ణభస్మం పౌడర్‌ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 


► స్వర్ణ భస్మం రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడంతో పాటు గుండె కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. 
► కడుపులోని ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి స్వర్ణభస్మం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇది అజీర్ణాన్ని పోగొడుతుంది. 
► స్వర్ణభస్మంలో యాంటీ పైరేటిక్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి జ్వరాలు, ఇతర ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. శతాబ్దాలుగా జ్వరాలకు ఆయుర్వేద చికిత్సలలో దీన్ని ఉపయోగిస్తున్నారు. 
► రక్తాన్ని శుద్దిచేసి బ్లడ్‌ ప్యూరిఫైయర్‌గా పనిచేసే సామర్థ్యం స్వర్ణభస్మంలో ఉంటుంది. 
► లైంగిక ఆరోగ్యాన్ని స్వర్ణభస్మం మెరుగుపరుస్తుంది. 
► యాంటీ-స్ట్రెస్, యాంటీ-డిప్రెషన్ వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమిని తగ్గిస్తుంది. 
► స్వర్ణ భాస్మాలో యాంటీ టాక్సిన్, యాంటీమైక్రోబయల్ యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ప్రారంభ దశలో టిబి కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కోగలవు.
► రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 
► కణితులు లేదా క్యాన్సర్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి కూడా పనిచేసే రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను స్వర్ణ భస్మం కలిగి ఉంది.

- డాక్టర్ నవీన్‌ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు

Videos

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు