Breaking News

డైట్‌ ప్లాన్‌లో ఉన్నారా : డిన్నర్‌ కోసం అదిరిపోయే పరాటా

Published on Sat, 10/26/2024 - 15:04

పోషకాలు  విరివిగా  లభించే ఆకుకూరల్లో ముఖ్యమైంది సోయా ఆకు. దీన్నే దిల్‌ఆకులు, సోయా లేదా సావా కూర అని కూడా పిలుస్తారు. సోయా ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా  లభిస్తాయి. ఆకారంలో కొత్తిమీర లా, మొక్క సోంప్‌ మొక్కలాగా  కనిపిస్తుంది. సువాసనకు ఇది పెట్టింది పేరు. సోయా  ఆకుతోఅనేక రకాల వంటకాలను చేసుకోవచ్చు. ఈ రోజు సోయా, ఓట్స్‌ పరాటా  ఎలా తయారు చేయాలో చూద్దాం.

సోయాకూరలోని విటమిన్ సీ  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ నియంత్రలో ఉంటుంది.  గ్యాస్‌, ఉబ్బరం లాంటి సమస్యలకు సోయాకూర మంచిది. అలాగే గాయాలను వేగంగా నయం చేయడానికి సహాయ పడుతుంది. విటమిన్ ఏతో కంటిచూపును మెరుగుపడుతుంది.ఇందులోని కాల్షియం మన ఎముకలను దృఢంగా మారుస్తుంది. మాంగనీస్ నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయంలో సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.

సోయా, ఓట్స్‌ పరాటా

కావాల్సినవి :
దిల్​ ఆకులు : ఒక కప్పు 
ఓట్స్ : ఒక టేబుల్ స్పూన్ 
గోధుమపిండి : ఒక కప్పు 
నెయ్యి  రెండు టీస్పూన్లు
నాలుగు పచ్చిమిర్చి 
జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఉప్పు, 
ఉల్లిగడ్డ తరుగు : అర కప్పు

తయారీ : గోధుమపిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి మృదువుగా, మెత్తగా కలిపి పక్కన పెట్టాలి.  శుభ్రంగా కడిగి, సోయా ఆకును తరిగి నేతిలో వేయించుకోవాలి.  తరువాత ఉలిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో ఓట్స్  వేసి రెండు నిమిషాలు ఉంచి బాగా కలపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

ఇపుడు ముందుగానే కలిపి ఉంచుకున్న చపాతీ పిండిలో, కావాల్సిన సైజులో చపాతీలా వత్తి, మధ్యలో సోయా ఆకులకూరను స్టఫ్‌చేసి  పరాటాలాగ వత్తాలి. వీటిని పెనం ​ మీద నెయ్యివేసి, సన్నని  మంటమీద కాల్చుకుంటే,  టేస్టీ , టేస్టీ సోయా, ఓట్స్‌ పరాటా రెడీ. దీన్ని  ఇలాగే తినేయొచ్చు. లేదంటే మీకు పచ్చడిని కొద్దిగా అద్దుకోవచ్చు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)