Breaking News

బీట్‌రూట్‌తో వెరైటీగా: ఇలా ఎపుడైనా ట్రై చేశారా?

Published on Fri, 11/15/2024 - 10:30

బీట్‌రూట్‌తో  ఎన్నో ఆరోగ్య ప్రయెజనాలు లభిస్తాయి. పచ్చిగా తినవచ్చు. లేదా  కూర చేసుకొని తినవచ్చు. ఇంకా బీట్‌రూట్‌తో జ్యూస్‌ చేసుకొని తాగవచ్చు. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చక్కటి పరిష్కారం. అలాగే మలబద్దకానికి మంచి  మందు.  వెరైటీగా బీట్‌రూట్‌తో వఫెల్స్‌  ఎలా తయారు చేసుకోవాలో  చూద్దాం!

కావలసినవి: ఓట్స్‌ –100 గ్రాములు; శనగపిండి లేదా ఉప్మా రవ్వ– 25 గ్రాములు; బీట్‌రూట్‌– చిన్న దుంప; పచ్చిమిర్చి –2; అల్లం– అంగుళం ముక్క; ఉప్పు పావు టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; ఆమ్‌చూర్‌  పౌడర్‌– అర టీ స్పూన్‌ ; జీలకర్ర  పొడి– అర టీ స్పూన్‌; నెయ్యి– టీ స్పూన్‌.

తయారీ: ఓట్స్‌ను మెత్తగా  పొడి అయ్యే వరకు మిక్సీలో గ్రైండ్‌ చేయాలి.  పొడి అయిన తర్వాత అందులో శనగపిండి లేదా రవ్వ వేసి గ్రైండ్‌ చేయాలి. అందులోనే ఆమ్‌చూర్‌ పౌడర్, జీలకర్ర  పొడి, ఉప్పు వేసి కలిసే వరకు ఒకసారి తిప్పి ఒక  పాత్రలో వేసి పక్కన ఉంచాలి మిక్సీ జార్‌లో బీట్‌రూట్, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓట్స్‌– శనగపిండి మిశ్రమంలో  పోసి కలపాలి. మరీ గట్టిగా అనిపిస్తే తగినంత నీటిని చేర్చి ఉండలు లేకుండా కలపాలి 

వఫెల్స్‌ చేసే ఇనుప పాత్రకు నెయ్యి రాసి వేడి చేసి అందులో పైన కలుపుకున్న ఓట్స్‌– బీట్‌రూమ్‌ మిశ్రమాన్ని పోసి సమంగా సర్ది మూత పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి. మూత తీసి చూసుకుని పిండి చక్కగా కాలిన తర్వాత దించేయాలి. ఈ వఫెల్స్‌కి పుదీన చట్నీ లేదా సూప్, చీజ్‌ మంచి  కాంబినేషన్‌.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)