Breaking News

తేనెతో ఎన్నో లాభాలు : కానీ కల్తీని ఎలా గుర్తించాలి!

Published on Sat, 02/08/2025 - 18:21

భారతదేశంలో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్లకు  నిస్పందేహంగా  వాడే పదార్థం తేనె (Honey). తేనెటీగల ద్వారా సహజంగా లభించే ఒక  తీపి పదార్థం (Natural Sweetener).  తేనె వలన చాలా ఆరోగ్య  ప్రయోజనాలున్నాయి. అలాగే కొలెస్ట్రాల్, కొవ్వు సోడియం లేని చక్కటి ఆహారం కూడా తేనె. ప్రపంచవ్యాప్తంగా తేనెను ఎక్కువగా ఉపయోగించేది మన భారతీయులే. అయితే కోవిడ్ తరువాత తేనె వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది విశ్వవ్యాప్తమైంది. పెరిగిన డిమాండ్‌ తో తేనె  కల్తీ కూడా పెరిగింది. మార్కెట్లో ఇప్పుడు స్వచ్ఛమైన  తేనె, బ్రాండ్లు చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి.

తేనెలో  యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌  లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. తేనెలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు  దండిగా లభిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల మాట దేవుడెరుగు కల్తీ తేనె అనేక సమస్యలకు కారణమవుతోంది.  అందుకే స్వచ్ఛమైన తేనె ఏది. నకిలీది ఏది  గుర్తించడం, దాని గురించి అవగాహనకలిగి ఉండటం చాలా అవసరం.

తేనె కల్తీ  ఎలా?
తేనె కల్తీ చౌకైన పదార్థాలతో చేయబడుతుంద. ఇది  ప్రయోగశాల పరీక్ష పారామితులను తేలిగ్గా దాటేస్తుంది. . 
మొలాసిస్: ఇది మందపాటి , జిగటగా చెరకు రసం. చెరకు రసం మరిగించడం వల్ల తేనెలా తీపిగా ఉండే టర్బిడ్, ముదురు ద్రావణం లభిస్తుంది.
ద్రవ గ్లూకోజ్: ఇది మిఠాయి చ బేకింగ్ పరిశ్రమలో ఉపయోగించే మెరిసే , మందపాటి ద్రావణం. ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది.
ఇన్వర్ట్ షుగర్: ఇది మెరిసే , మందపాటి ద్రవం, శుద్ధి చేసిన చక్కెరను ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని ఉత్పత్తి  చేస్తారు.
హై గ్లూకోజ్ కార్న్ సిరప్ (HFCS): ఇది స్వీట్‌కార్న్‌ను ప్రాసెస్ చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది.ఇది అచ్చం తేనెలాగానే కనిపిస్తుంది. 
రైస్ సిరప్: ఈ సిరప్ బియ్యం ప్రాసెసింగ్ సమయంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తేనెను కల్తీ చేసే వాటిలో ఒకటి.

ఇదీ చదవండి: సిల్వర్ స్క్రీన్ క్వీన్ : దేవుడా, ఇలాంటి జీవితం పగవాడిక్కూడా వద్దు!

 

తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీదా ఎలా తనిఖీ చేయాలి?
బొటనవేలిపై కొద్దిగా తేనె రాసుకొని చూడండి. నిజమైన తేనె చిక్కగా ఉంటుంది. 
తేనెను ఒక గ్లాసు నీటిలో నెమ్మదిగా వేయండి. తేనె నీటిలో కరగకుండా గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే తేనె స్వచ్ఛమైనది. నీటిలో కరిగిపోతుంటే అది నకిలీది అని అర్థం. 
వెనిగర్ నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. మిశ్రమం నురగలు రావడం ప్రారంభిస్తే అది  కచ్చితంగా నకిలీదే. 
తేనెలో అగ్గిపుల్లను ముంచి, ఆపై వెలిగించడానికి ప్రయత్నించడం ద్వారా ఇంకో పరీక్ష చేయవచ్చు.  తేనె స్వచ్ఛంగా ఉంటే, అగ్గిపుల్ల సులభంగా మండుతుంది. కల్తీ దైతే అగ్గిపుల్లను వెలిగించడం కష్టం కావచ్చు.

ఇదీ చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్‌ అయ్యిందిలా!

తేనె-ప్రయోజనాలు 
తేనె సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. తేనె అనేది గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
కాలిన గాయాలు, దెబ్బలకు పై పూత చికిత్సగా వాడవచ్చు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు సూపర్-హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అందుకే మొటిమల నివారణలోకూడా పనిచేస్తుంది

తేనెలో కాటలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చిన్న మంట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందిహృదయనాళ వ్యవస్థను రక్షించండి 
గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది.  జ్ఞాపకశక్తి లోపాలను నివారిస్తుంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)