Breaking News

పచ్చిమిరపమొక్కల్ని ఇలా పెంచితే కాయలే కాయలు!

Published on Mon, 07/29/2024 - 13:42

గార్డెనింగ్‌ ఒక కళ. కాస్త ఓపిక, మరికాస్త శ్రద్ధపెడితే ఇంట్లోనే చాలారకాల పూల మొక్కల్ని పెంచుకోవచ్చు.  కూరగాయలు, ఆకుకూరలు పండించు కోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి బాల్కనీలోగానీ, ఇంటిముందు ఉన్న చిన్నస్థలంలోగానీ హాయిగా వీటిని పెంచు కోవచ్చు. గార్డెనింగ్‌తో మనసుకు సంతోషం మాత్రమేకాదు  ఆర్గానిక్‌  ఆహారాన్ని తిన్నామన్న  ఆనందమూ మిగులుతుంది.  కిచెన్‌గార్డెన్‌లో చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఒకటి పచ్చి మిరపకాయ.  ఇంట్లోనే పచ్చి మిరపకాయలను ఎలా పండించవచ్చు?  తొందరగా పూత, కాపు రావాలంటే  పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

పచ్చిమిరపతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆహారంలో రుచిని జోడించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి విటమిన్‌ పుషల్కంగా లభిస్తుంది.  మొటిమలు,  చర్మం ముడతల్ని నివారిస్తుంది.  జుట్టుకు మంచిది , బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా  చాలా  మంచిది. మరి ఇన్ని రకాల లాభాలున్న  ఈ చిన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి.

సరైన విత్తనాలు ఎంచుకోవడం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరపగింజలు వేసినాసులభంగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం రావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి.  చిన్ని చిన్న కంటైనర్‌లు , కుండీలలో కూడా బాగా పెరుగుతాయి.  3-4 అంగుళాల లోతు , సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోండి. తేమ , వెచ్చని వాతావరణం అవసరం కాబట్టి వాటిని పండించడానికి ఇంట్లో సెమీ షేడ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కంపోస్ట్‌ కలిపిన సారవంతమైన  మట్టితో కుండీని  ఉపయోగించాలి.

 మంచి నాణ్యమైన పచ్చిమిర్చి విత్తనాలను తీసుకుని, కుండీలో ఒక అంగుళం లోతులో నాటండి. మట్టిని తేమగా ఉంచాలి. అలా అని ఎక్కువ నీరు పోయకూడదు. వాతావరణాన్ని బట్టి ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి నీరు పోయాలి. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోతుంది. 

విత్తనాలను నాటిన 7-10 రోజులలో రెండు చిన్న మొలకలు వస్తాయి. వీటికి ప్రతిరోజూ 5-6 గంటల సూర్యకాంతి  తగిలేలా చూసుకోవాలి.  కాస్త ఎదిగిన  తరువాత ఈ మొక్కలకు  ట్రిమ్మింగ్‌  చాలా కీలకం. పూతకు ముందే చివర్లను కత్తిరిస్తే, మొక్క గుబురుగా వచ్చి, తొందరగా పూత కొస్తుంది. పూత దశలో లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌  మొక్కకు అందిస్తే  పూత నిలబడి, బోలెడన్ని కాయలు వస్తాయి.  సరైన రక్షణ,  పోషణ అందితే దాదాపు రెండేళ్లయినా కూడా మిరప చెట్టు కాయలు కాస్తుంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)