Breaking News

అనారోగ్యం అంటే ఏంటీ..? ప్రకృతి వైద్యం ఏం చెబుతోంది?

Published on Wed, 09/13/2023 - 13:16

ప్రతి రోజూ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించ లేనివారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులు త్యాగం చేయక తప్పదు. మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, డయాబెటిస్, కార్డియోవాస్కులర్‌ సమస్యలు వంటివాటి బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్ర మిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది, దీనిని నివారించడానికి ఏమాత్రం ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని  ‘ప్రకృతి వైద్యం’ ద్వారా నయం చేసుకోవచ్చు. 

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది. కష్టతరమైన పనులు చేసేవారు, రైతులు, కూలీలు, హెవీ మోటార్‌ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హమాలీలు, శరీర కష్టం చేసే వారు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. రోజువారీ పనులనునడక, సైకిల్‌ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి. వ్యాయామం ఏదైనా ఒక్కటే నియమం, ‘శక్తికి మించి వ్యాయామం చేయకూడదు’. మిట్ట మధ్యాహ్నం ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది.

నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్‌ చేయడం మంచిది. ఒబేసిటీ, బీపీ, మధుమేహ నియంత్రణకు వ్యాయామం చాలా అవసరం. అలాగే మనం ఇంట్లో కూర్చుని యోగ పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. యోగాసనాలు శరీరానికి, మెదడుకీ ఎంతగానో  మేలు చేస్తాయి. ప్రకృతివైద్య సిద్ధాంతంలో, అనారోగ్యం అనేది ఆరోగ్యానికి భంగం కలిగించే ప్రక్రియగా, సహజ వ్యవస్థల సందర్భంలో ఆ తర్వాత కోలుకునే ప్రక్రియగా పరిగణించబడుతుంది. పేలవమైన పోషణ, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అనేకమైన విషయాలు ఆరోగ్యానికి ఎక్కువగా భంగం కలిగిస్తాయి. వీటిని గుర్తించడం, తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వైద్యుల లక్ష్యం. 
– డా‘‘ ఎం. అఖిల మిత్ర, గౌతమ బుద్ధ అభివృద్ధి సమాఖ్య 

#

Tags : 1

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)