Breaking News

వర్షాకాలంలో విటమిన్‌-డి తీసుకోవడం ఎలా? సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చా?

Published on Thu, 07/20/2023 - 14:43

మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్‌-డి ఒకటి. దీన్ని  ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరీనాకి కాల్షియం అందించడంలో విటమిన్‌-డి ఎంతో ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి సరైన మోతాదులో విటమిన్‌-డి లభించకపోతే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్‌ కంటే సూర్యకాంతిలో విటమిన్‌-డి సమృద్దిగా దొరుకుతుంది. మరి ఈ వర్షాకాలంలో విటమిన్‌-డిని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టోరీలో చూసేద్దాం.


►భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. 


విటమిన్‌-డి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

  • ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్‌-డి ఉంటుంది. 
  • పాలలో విటమిన్‌-డితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి
  • పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్‌-డి లోపాన్ని అధిగమించవచ్చు. 
  • ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్‌, ట్యూనా వంటి చేపలు తినాలి
  • నారింజలో విటమిన్‌-సితో పాటు విటమని్‌-డి కూడా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
  • ఆకుకూరలు, సోయా పాలు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.


విటమిన్‌-డి ఎంత మొత్తం తీసుకోవాలి

  • ఆరోగ్యకరమైన ఎముకలు, కాల్షియం, మెటబాలిజం మెయింటేన్‌ చేయాలంటే తగిన మోతాదులో విటమిన్‌-డి అవసరం.
  • పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 
  • 70 ఏళ్లు పైబడిన వారిలో 800 ఐయూ (20 ఎంసీజీ) అవసరం. 
  • ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. 
  • సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)