Breaking News

బ్రెడ్‌ ఆరోగ్యానికి మంచిది కాదా..?

Published on Wed, 09/13/2023 - 15:48

అనారోగ్యంగా ఉన్న పేషెంట్లు ముందుగా కోలుకునేంత వరకు బ్రెడ్‌లే పెడుతుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ అయితే ఈజీ అని అందరూ దాన్నే ప్రిఫర్‌ చేస్తారు. పిల్లల కూడా జామ్‌, ఆమ్లెట్‌ వంటి వాటిని నొంచుకుని మరీ లాగిస్తుంటారు బ్రెడ్‌ల్ని. అయితే అవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వార్నింగ్‌ ఇస్తున్నారు వైద్యులు. ఆ బ్రెడ్‌లు ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలను చూపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రెడ్‌ ఎక్కువగా వినయోగించడం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

ఎందువల్ల ఇది ప్రమాదకారి అంటే..
►ఇంట్లో తయారు చేసే బ్రెడ్‌లో సాధారణమైన వాటినే కలుపుతాం. తాజాగా బ్రెడ్‌ తింటాం. అదే మార్కెట్లో లభించే బ్రెడ్‌ అయితే తాజాగా ఉండేందుకు సోడియం సల్ఫెట్‌, పోటాషియం మెటాబైసల్ఫైట​ వంటి వాటిని అధికమొత్తంలో కలుపుతారు. దీనివల్ల ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు పెరిగే ప్రమాదం ఉంది. బ్రెడ్‌ మెత్తగా ఉండేందుకు వినియోగించే ఎమల్సిఫైయర్లు మైక్రోబయోమ్‌లు కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొనవల్సి వస్తుంది. 
►నిల్వ ఉండేదుకు వాడే రసాయానాలు కారణంగా ఆస్తమా, శ్వాసకోస సంబంధిత సమస్యలు వస్తాయి. మార్కెట్లో లభించే బ్రెడ్‌లు స్వచ్ఛమైన గోధుమ పిండి లేదా మైదా పిండితో తయారవ్వవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. దీని కారణంగా టైప్‌ 2 మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. 
►మార్కెట్లో తయారయ్యే బ్రెడ్‌లో ఫైబర్‌ కంటెంట్‌ తక్కువుగా ఉంటుంది. దీని కారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. 
కొన్ని బ్రెడ్‌లలో అధిక చక్కెర ఉంటుంది. ఇది ఊబకాయం, దంత క్షయం, ఇతర ఆరోగ్య సమస్య తలెత్తడమే గాక శరీరంలో అధిక కేలరీలు పెంచుతాయి. 
►ఈ బ్రెడ్‌లకు కుత్రిమ రంగులు జోడించటం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాన్ని పెంచుతుంది. 
 

గమనిక: ఎప్పుడూ బ్రెడ్‌ కొనేటప్పుడూ అందులో వాడే పదర్థాల మోతాదును చదివి ఎప్పుడూ తయారయ్యింది తదితర వివరాలు చదివిగానీ తీసుకోకండి. సాధ్యమైనంత మేర ఇంట్లో తయారయ్యే బ్రెడ్‌నే వినయోగించండి.

(చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్‌ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!)

#

Tags : 1

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)