Breaking News

ఆ ఊళ్లో.. ఇళ్లు, కారు చౌక! ధర ఎంతంటే? కేవలం...

Published on Sun, 06/30/2024 - 03:29

ఆ ఊళ్లో ఇళ్లు కారుచౌకగా దొరుకుతాయి. అక్కడి ఇళ్ల ధరలు తెలుసుకుంటే, ఇక్కడి జనాలు ఏమాత్రం నమ్మలేరు. ఆ ఊరు ఇటలీలో ఉంది. సిసిలీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని సంబూకా అనే పట్టణంలో ఒక్కో ఇల్లు ఒక యూరో నుంచి మూడు యూరోల (దాదాపు రూ. 90 నుంచి రూ. 270) ధరకే  దొరుకుతాయి.

సరిగా చెప్పాలంటే, ఈ ఇళ్లు మామూలు పిజ్జా ధర కంటే తక్కువే! ఇటలీలో పిజ్జా ధర దాదాపు 5 యూరోల (రూ.446) వరకు ఉంటుంది. ఈ పట్టణంలో ఇప్పటికే రెండుసార్లు– 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఇళ్ల వేలం నిర్వహించారు. ఆ వేలం పాటల్లో ఇళ్ల ధరలు ఒక యూరో నుంచి మూడు యూరోల వరకు పలికాయి.

త్వరలోనే మరోసారి ఈ ఊళ్లో ఇళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈసారి కూడా వేలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదని, ఇళ్ల ప్రారంభ ధరలు 3 యూరోల (సుమారు రూ.270) నుంచి మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలాకాలంగా ఖాళీగా మిగిలిపోయి, పాడుబడిన ఇళ్లను ఈ పట్టణ సంస్థ ఇలా వేలంలో విక్రయిస్తోంది. వీటిని కొనుగోలు చేసేందుకు ఇటాలియన్లతో పాటు ఇటలీకి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

పురాతనమైన పాడుబడిన ఇళ్లకు పన్నులు కట్టలేక కొందరు యజమానులు వాటిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నారని, అందుకే ఇక్కడ ఇళ్లు ఇంత చౌకగా దొరుకుతున్నాయని రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ మారిజియో బెర్తీ చెబుతున్నారు. ఇక్కడ చౌకగా దొరికే ఇళ్లలో ఎక్కువగా శతాబ్దాల కిందట నిర్మించినవి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మసూద్‌ అహ్మది అనే వ్యక్తి, ఆయన భార్య షెల్లీ ఇక్కడ మూడు యూరోలకు 2019లో పద్దెనిమిదో శతాబ్ది నాటి ఇల్లు కొన్నారు.

దానిని 8400 యూరోల (సుమారు రూ.7.50 లక్షలు) ఖర్చుతో బాగు చేయించుకున్నారు. ఇక్కడ ఇళ్ల ధరల కంటే, వాటి మరమ్మతుల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. మరమ్మతు ఖర్చులు కలుపుకున్నా, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక అనే చెప్పాలి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)