మూగజీవాల పట్ల ఆదరణ చూపండి

Published on Fri, 04/25/2025 - 17:36

వేసవి ఎండలు మనుషులతోపాటు పశువులు, పక్షులపై కూడా తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. తాగునీరు లభించక, ఎండ వేడి తాళలేక అనేక పక్షులు నేల రాలుతున్నాయి. వీధి కుక్కలు, పిల్లులు వడదెబ్బ, అనారోగ్యంతో ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నాయి. ఇలాంటి మూగజీవాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రాణిమిత్రులు. అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సహకారంతో వాటికి చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. ఇలా మార్చి నుంచి ఇప్పటిదాకా 90పైగా పశువులు, పక్షులకు చికిత్స చేయించారు.  

అపూర్వ కృషితో..సాధారణ స్థితికి.. 
ప్రస్తుతం ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రికార్డు స్ధాయిలో ఎండలు కాస్తున్నాయి. దీని వల్ల పక్షులు, జంతువులు వడదెబ్బ, అనారోగ్యాలతో చెట్లు, రోడ్లు, ఖాళీ మైదానాలు ఇలా ఎక్కడపడితే అక్కడ నేలకూలుతున్నాయి. కొన్నిసార్లు వీటి ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రాణిమిత్రులు చేస్తున్న కృషి అపూర్వం. ఇలా అనారోగ్యంతో కునారిల్లుతూ తమ కంటబడిన ప్రాణులకు సకాలంలో వైద్య చికిత్స అందించి తిరిగి వాటిని సాధారణ స్థితి తీసుకురావడంలో వీరి పాత్ర ఎనలేనిది. ముంబైలో రోడ్లకు ఇరువైపుల, నివాస సొసైటీలు, టవర్ల ఆవరణలు, వాణిజ్య, వాపార సంస్ధల కాంపౌండ్‌లలో లక్షలాది చెట్లున్నాయి. వాటన్నింటిపై దృష్టిసారించడం ప్రాణి మిత్రులకు సాధ్యం కాని పని. అందుకే కొన్ని సార్లు అటవీ శాఖ, స్వయం సేవా సంస్ధల సాయం తీసుకుని పక్షులు, జంతువులను కాపాడుతున్నారు. ఇలా కొద్దిరోజులుగా అటవీ శాఖ, రెస్క్యూ అసోసియేషన్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంస్ధలు వందకుపైగా పక్షులను కాపాడాయి.  

చదవండి : Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!

కోలుకోగానే..యథాస్థానాలకు... 
కాగా ఇటీవల ముంబై సిటీ, ఉప నగరాల్లోని బోరివలి, అంధేరీ తదితర ప్రాంతాల్లో పావురాలు, రామ చిలుకలు, పిచ్చుకలు, గుడ్లగూబలు, కాకులు, కోతులు, పిల్లులు, కుక్కలు ఇలా రకరకాల పశు, పక్షులు అనారోగ్య స్ధితిలో కనిపించాయి. స్ధానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీ శాఖకు, స్వయం సేవా సంస్ధలకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వైద్యుల బృందం వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకుని ఫస్ట్‌ఎయిడ్‌ చేసి పరేల్‌లోని యానిమల్‌ క్రూయాల్టీ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఇవన్నీ అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు వేల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పవన్‌ శర్మ తెలిపారు. పూర్తిగా కోలుకోగానే తిరిగి బయట వదిలేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుట పడగానే వాటిని నైసర్గిక ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేస్తామని ఆయన అన్నారు. ప్రజలంతా పశు, పక్షుల పట్ల మానవతా ధృక్పదంతో వ్యవహరించాలని ఖాళీ ప్రదేశాలలో, రోడ్ల పక్కన నీటితో నింపిన గిన్నెలు, ప్లేట్లు, ప్లాస్టిక్‌ మగ్గులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బతో బాధపడుతున్న జంతువులు, ఎండ వేడికి నేలరాలుతున్న పక్షుల గురించి 1926 అనే హెల్ప్‌ లైన్‌ నంబరుకు తెలియజేయాలని శర్మ విజ్ఞప్తి చేశారు.      

ఇదీ చదవండి: కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)