Breaking News

ఆత్మసాక్షాత్కారం సాధించాలంటే..వీటిని జయించాలి!

Published on Thu, 01/30/2025 - 11:35

భ్రమలో ఉండేవారిని అజ్ఞానం ఎంతో తికమకపరుస్తుంది. అటువంటి వారు అనాత్మను ఆత్మగాను; ఆత్మను అనాత్మగాను తలచి ఒకదానిపై వేరొకదానిని ఆరోపించుకుంటున్నారు. వారి సహజ ప్రకృతి వల్ల సచ్చిదానందం అనే వాస్తవాన్ని మరచి పోతున్నారు. ప్రాపంచిక విషయాల్లోనే సంతోషం ఉందనుకుంటున్నారు. భ్రమలో ఉండేవారు ఆత్మనే పరమాత్మ అనే వాస్తవాన్ని తెలుసుకోలేక పోతున్నారు. అటువంటి వారికి విగ్రహా రాధన మొదటి మెట్టుగా పెద్దలు చెప్పారు. ఆత్మే ఎప్పుడూ బంధరహితంగా ఉంటుందనే సత్యం తెలియనంత వరకు అల్పప్రాణులు అనేక దీక్షలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేయడానికి పూనుకుంటారు. ఎంతకాలం ఈ శరీరమే ‘నేను’ అనే భావాన్ని కలిగి ఉంటారో అంతకాలం వారెవరూ ఆత్మసాక్షాత్కారం పొందలేరు.

ఆధ్యాత్మిక మార్గం ప్రకారం... శారీరక స్పృహ అజ్ఞాన సూచికే. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అని మూడు వాసనలు ఉంటాయి. దేహ ధర్మములను ఆత్మపై ఆరోపించడమే ‘దేహవాసన’. నేను సాధించాను, నేను పండితుడను, నేను శాస్త్రాన్ని పఠించాను అనే భావన ‘శాస్త్రవాసన’. ఈ ప్రపంచమే యథార్థమైనది అని తలచి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండటమే ‘లోకవాసన’. వాసనలు ఉన్నంతకాలం మోక్షం లభించదు. వాసనలను దూరం చేయడానికి దివ్య నామ సంకీర్తన, నిరంతర దైవదర్శనం ఉపయోగపడతాయి.

ఆధ్యాత్మిక, ఆచార పర ప్రయాణమే ‘అంతరంగ ప్రయాణం’. సద్గుణాలను పెంచుకొని, మనస్సును పరిశుద్ధం చేసికొని జ్ఞానంతో వాటిని  కలుష రహితంగా ఉంచాలి. సృజనాత్మకమైన బుద్ధిబలం పెరిగిన కొలదీ తాత్విక చింతనముందడుగు వేస్తుంది, సత్యాన్వేషణ పట్ల జిజ్ఞాస పెరుగుతుంది. వయసు పెరిగిన కొలది శరీరం ఏ విధంగా పెరుగుతుందో, అదే విధంగా మనలో ఉండే మనస్సు, బుద్ధి బలం (జ్ఞానము) కూడా సద్గుణాలతో వెలగాలి. ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదని గుర్తెరగాలి. తర్కంలో చురుకు దనాన్ని పెంచుకొని నిత్య, అనిత్య వస్తు భేదమును సరిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత నిరంతర ఆచరణతో, శుద్ధ సంకల్పంతో ప్రయత్నించి జిజ్ఞాసాపరుడు అంతరాత్మ సాక్షాత్కారం పొందగలడు.

-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)