Breaking News

తొందరపడి లిప్‌ లాక్‌ చేస్తున్నారా? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసా?

Published on Sat, 04/13/2024 - 17:07

ఇరువురు మనుషులు కలుసుకున్నపుడు చక్కని చిరునవ్వు, కరచాలనం, ఆత్మీయం ఆలింగనం ఇది సర్వ సాధారణం. మరికొన్ని చోట్ల ముద్దుగా బుగ్గలమీద చిన్న ముద్దుపెట్టుకోవడం ఒక అలవాటు. చిన్నారులను చూసినపుడు అందరమూ  ముద్దు చేస్తాం. ఎదుటివారి పట్ల తమ ప్రేమను తెలియజెప్పేందుకు ఇలా   చేస్తుంటాం. 
  
అదే ప్రేమికుల మధ్య ఈ ముద్దుల బంధం ఇంకొంచెం..మధురంగా ఉంటుంది. అయితే సినిమా కల్చర్‌ అనండీ..పాశ్చాత్య నాగరికత అనండీ.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.  ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

లిప్‌ టూ లిప్‌ ముద్దుల వల్ల  లాభాల మాటేమో గానీ.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉన్నాయంటున్నారు నిపుణులు. చిన్నపిలల్ల్ని ఇలా ముద్దు పెట్టుకోవడం చాలా అనర్థం. తీవ్ర అనారోగ్యం, ఫ్లూ, వైరస్‌ల బారిన పడిన వారితో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. 

 ♦ ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి.
♦ ఈ రకం ముద్దుల వల్ల మోనోన్యూక్లియోసిస్,  మెనింజైటిస్ వంటి వైరస్‌లను వ్యాపింపజేస్తుంది. మోనో వైరస్ కారణంగా కొందరిలో ఆరు నెలల పాటు విపరీతమైన అలసట వంటి లక్షణాలుంటాయి.
♦  మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధిలు కూడా వ్యాప్తిస్తాయి.
♦ క్లామిడియా గనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చు. లైంగిక వ్యాధులు కూడా  చాలా తొందరగా వ్యాప్తిస్తాయి.
♦ స్వీడిష్ సర్వే ప్రకారం,  అలెర్జీ ఉన్న వారిని ముద్దుపెట్టుకునే 12 శాతం మందికి అలెర్జీ త్వరగా సోకుతుంది.  దురద, వాపు వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా లిప్ టూ లిప్ కిస్సులకు దూరంగా ఉండాలి.
♦ పంటి, చిగుళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలన్నాయంటే నమ్ముతారా?   తీవ్ర చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు.  
♦  న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చివరిగా మరోమాట ఇలాంటి వేవీ గమనించకుండా తొందరపడితే దద్దుర్లు, ముఖం వాపు, శ్వాస ఆడకపోవడం, ఒక్కోసారి వాంతులు కూడా  సంభవించవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)