Breaking News

'రియల్‌ లైఫ్‌ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!

Published on Sun, 02/02/2025 - 16:44

పరాన్నజీవులు గురించి విన్నాం. ఇతరులను ఆశ్రయించి బతికే వాటిని పరాన్నజీవులు అనిపిలుస్తాం. పందులు, ఇతర జంతువులు ఆశ్రయించి ఉండే బద్దేపురుగులు, వైరస్‌లను ఇలా పిలుస్తాం. అయితే మనుషుల్లో కూడా కొందూ ఇతరులపై ఆధారపడి జీవనం సాగించేవారిని కూడా ఇలా పోలుస్తు తిడుతుంటారు. కానీ అచ్చం అలానే రియల్‌ లైఫ్‌ పరాన్నజీవిలా జీవనం సాగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పైగా దొరికిపోయి కూడా అడ్డంగా బుకాయించే యత్నం చేసిందామె. ఈ విషయం కాస్తా కోర్టుదాక చేరుకుంటే గానీ ఆమె తిక్క కుదరలేదు. 

అసలేం జరిగిందంటే..తూర్పు చైనా(China)లోని జియాంగ్సు ప్రావిన్స్‌లో నివశిస్తున్న లీ అనే వ్యక్తి ఒక రోజుల తన ఇంటిని శుభ్రపరుస్తున్నాడు. సరిగ్గా ఆసమయంలోనే తన ఇంటి బేస్మెంట్‌(Basement)లో ఒక గది ఉండటం చూసి విస్తుపోతాడు. అక్కడ ఒక మనిషి జీవనం సాగిస్తున్నట్లు అన్ని వసతులు ఉంటాయి. 

ఇదేంటని ఆశ్చర్యపోతూ..క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె ఎవరా అని ఆలోచించగా.. ఈ ఇంటి పాత యజామని(Former Homeowner) జాంగ్‌గా గుర్తించి కంగుతింటుంది. వెంటనే లీ తనకు ఈ ఇల్లుని కొనుగోలు చేసిన మాజీ యజమానురాలు జాంగ్‌ని గట్టిగా నిలదీస్తుంది. 

అయితే ఆమె తెలివిగా ఇంటి గురించి పూర్తి సమాచారం ఇచ్చానే గానీ కింద బేస్‌మెంట్‌ మీకు చెందుతుందని ఒప్పందంలో లేదంటూ మాట్లాడుతుంది. కానీ లీ తనకు అమ్మకం సమయంలో ఇంటి బేస్మెంట్‌ గురించి రహస్యంగా ఉంచి మళ్లీ ఇలా దబాయిస్తుందని మండిపడతాడు. 

పైగా ఇల్లు అమ్మేశానే కానీ బేస్మింట్‌ కాదని తేల్చి చెప్పింది పాత యజమానురాలు జాంగ్‌. పైగా విరామ సమయంలో ఇలా ఆ బేస్‌మెంట్‌లో సేదతీరుతానని కరాఖండీగా చెప్పింది. అయితే ఇక్కడ లీ గమనించకుండా జాంగ్‌ ఎలా ఆ బేస్మెంట్‌లోకి వెళ్లి వస్తుందన్నది అస్పష్టంగా ఉంది. ఈ స్టోరీ అచ్చం చైనాలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం పారాసైట్ కథలా ఉంది. ఈ మూవీలో కూడా ఒక వ్యక్తి బేస్మెంట్లో రహస్యంగా సంవత్సరాలు గడుపుతాడు. 

కాగా, దీనిపై చాలా సీరియస్‌గా ఉన్న లీ వెంటనే ఈ విషయమై కోర్టు(court)ని ఆశ్రయించి గట్టిగా పోరాడతాడు. చివరికి మాజీ ఇంటి యజమానిపైకేసు గెలిచి నష్టపరిహారం కూడా అందుకుంటాడు లీ.

(చదవండి: ఈ డివైజ్‌తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!)

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)