Breaking News

వుడెన్‌ ఆర్ట్‌తో ఇంటి లుక్‌నే మార్చేద్దాం ఇలా..!

Published on Sun, 06/22/2025 - 11:44

సాదాసీదా గోడలను కళాత్మకంగా అలంకరించడానికి వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. వాటిలో వాల్‌ పోస్టర్లు, ఫొటో ఫ్రేమ్‌లు, హ్యాంగింగ్స్, పెయింటింగ్స్‌– ఇలా విభిన్న రకాల వాటితో ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంటారు. ఈ జాబితాలో వుడెన్‌ ఫ్రేమ్స్‌ది ప్రత్యేకమైన స్థానం. ఇంటికి వింటేజ్‌ కళకు వుడెన్‌ ఆర్ట్‌ స్పెషల్‌ లుక్‌తో అట్రాక్ట్‌ చేస్తుంది. ఇంట్లో సాదా గోడలు చూడటానికి కళావిహీనంగా ఉంటాయి. వాటిని కళాత్మకంగా మార్చడానికి వుడెన్‌ ఆర్ట్‌ వాల్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. పక్షులు, ఫలాలు, లతలు, పువ్వులు వంటివన్నీ నింపుకున్న డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా కొంచెం క్రియేటివిటీతో వీటిని తయారు చేసుకోవచ్చు. వుడెన్‌ వాల్‌ డిజైన్లను సృష్టించడానికి అనేక సృజనాత్మక ఆలోచనలతో అనేక రకాల డిజైన్లను ప్రయత్నించవచ్చు. 

ఫొటోగ్రాఫ్‌ ప్యాటర్న్స్‌
వుడెన్‌ స్లాబ్స్‌ లేదా ఫ్రేమ్స్‌పైన పెయింటింగ్‌ లేదా వేర్వేరు ప్యాటర్న్స్‌ లేదా జామెట్రిక్‌ రూపాలను రూపొందించవచ్చు. బేసి సంఖ్య లేదా సరి సంఖ్యలో గోడ పొడవు వెడల్పులను బట్టి ఎంత మేర డిజైన్‌ చేయాలనుకుంటున్నారో అన్ని ఫ్రేమ్స్‌ తీసుకోవచ్చు. చిన్నా పెద్ద, వెడల్పు వుడెన్‌ క్యూబిక్స్‌ను ఎంచుకోవచ్చు. 

పక్షులు, పూల చిత్రాలువుడెన్‌ స్లాబ్స్‌పైన పక్షులు, చెట్లు, పూలు చెక్కించవచ్చు. లేదా చెక్కినవి మార్కెట్లో ఎంపిక చేసుకోవచ్చు. 

ట్రయాంగిల్, స్క్వేర్, డైమండ్‌వుడెన్‌ టైల్స్‌లో త్రికోణం, చతురస్రం, డైమండ్‌ ఆకారాలు వచ్చేలా కట్‌ చేసుకొని, పెయింట్‌ వేసి లేదా వేయకుండా కూడా వాల్‌ డెకర్‌లో ఉపయోగించవచ్చు, వుడెన్‌ ప్యానెల్స్‌ ఒక దిశలో అమర్చినప్పుడు వాటి మధ్య పూర్తి విరుద్ధమైన డిజైన్‌ని ఉంచడం వల్ల కూడా ప్రత్యేకమైన లుక్‌ వస్తుంది. 

లైనింగ్‌ ఇన్‌ లెటర్స్‌ 
ఇంటి పేర్లు, హ్యాపీనెస్‌ లేదా చిన్న చిన్న కోట్స్‌ వంటివి వుడెన్‌ ఫ్రేమ్స్‌ మీద డిజైన్‌ చేయించి కూడా వాల్‌ డెకర్‌గా ఉపయోగించవచ్చు. కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా ఈ ఫ్రేమ్స్‌కి వాడవచ్చు. 

ఫ్యాబ్రిక్‌ ప్రింటింగ్‌ అచ్చులు 
చీరలు, దుపట్టాల మీద వేసే వుడెన్‌ అచ్చులను కూడా వాల్‌ డెకర్‌కి ఉపయోగించవచ్చు. వీటిలో మామిడి పిందెలు, మండలాకార డిజైన్లు వంటివి లభిస్తాయి.  

(చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్‌ వేడుకే..!)

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)