Breaking News

ఆధునిక ఇంటికి గిరిజన కళ..!

Published on Sun, 06/15/2025 - 13:07

ఇల్లు రిచ్‌గా ఉండాలా, కళాత్మకంగా ఉండాలా అనే ఆలోచన యువతలో కలుగుతుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిచ్‌నెస్‌ తగ్గకుండా కళాత్మకంగానూ కనిపించాలనే అభిరుచి గలవారికి గిరిజన జీవనశైలిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, ప్రింట్లు ఆధునిక గృహాలంకరణలో వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి.

సరైన నమూనాలు
గిరిజన కళ ఉట్టిపడాలి కదా అని ఉన్న స్థలంలో మొత్తం అవే డిజైన్స్‌తో ముంచెత్తకుండా సంప్రదాయ, ఆధునిక అలంకరణతో బ్యాలెన్స్‌ చేయాలి. సోఫా కవర్లు లేదా కుషన్లు, బొమ్మలు.. వంటి చిన్న గిరిజన వస్తువులతో ప్రారంభించవచ్చు. రగ్గులు, లాంప్‌షేడ్‌లు, గిరిజన మోటిప్స్‌ ఉన్న టేబుల్‌వేర్‌ వంటివి అలంకరణను అద్భుతంగా మార్చేస్తాయి. 

రంగులు, అల్లికలతో బ్యాలెన్స్‌
అలంకరణలో గిరిజన ప్రింట్‌లను ప్రవేశపెట్టేటప్పుడు, రంగుల గురించి కూడా ఆలోచించాలి. గోధుమ, ఆకుపచ్చ, మట్టి టోన్‌లతో ఆ కళను తీసుకురావచ్చు. నేత ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన కర్టెన్లు, కుషన్‌ కవర్లు, బెడ్‌షీట్లు వంటివి ఎంపిక చేసుకోవచ్చు. వాల్‌ హ్యాంగింగ్స్‌గా అల్లికలను జోడించవచ్చు. 

గిరిజన కళాఖండాలను చేర్చడం
గిరిజన కళాఖండాలలో ప్రధానంగా చెప్పుకోదగినవి శిల్పాలు. ఇవి గదికి ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. అయితే, ఇవి ఇతర డిజైన్‌ అంశాలను అధిగమించేంత ఎక్కువ ఉండకూడదు. గిరిజన కళాఖండాలను గాజు అల్మరాల్లో ఉంచడం లేదా వాల్‌ ఆర్ట్‌గా ఉపయోగించడం వల్ల అలంకరణలో కొత్తదనాన్ని తీసుకురావచ్చు.
ఎన్‌.ఆర్‌ 

(చదవండి: హలో మూవీ కళ్యాణి ప్రియదర్శిని ‍బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)