Breaking News

మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్‌ బ్యూటీ డివైజ్‌..

Published on Sun, 10/12/2025 - 11:40

చాలామంది తమలో వృద్ధాప్యఛాయలు రాకుండా చూసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందంగా, యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఇప్పుడు కొత్త ‘పోర్టబుల్‌ హ్యాండ్‌హెల్డ్‌ యాంటీ–రింకిల్‌ బ్యూటీ డివైజ్‌’ అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంట్లోనే సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

ఈ పరికరం చర్మ ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఈ డివైజ్‌ సాయంతో చర్మాన్ని లిఫ్ట్‌ చేసి, బిగుతుగా ఉంచుకోవచ్చు. చర్మంపై ఉండే సన్నటి ముడతలను ఈ పరికరం సమర్థవంతంగా తగ్గిస్తుంది. చర్మంపై కనిపించే రంధ్రాలు పెద్దవిగా ఉంటే, ఈ పరికరం వాటిని చిన్నవిగా చేయడానికి సహాయపడుతుంది.

ఈ డివైజ్‌ చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొలాజెన్‌ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా మార్చి, దానిని పునరుజ్జీవింపజేస్తుంది. ఈ డివైజ్‌ అయానిక్‌ మోడ్‌ ఆప్షన్లతో పనిచేస్తుంది. దీనిలో హై, లో, మీడియం వంటి మైక్రో కరెంట్‌ పవర్‌ ఆప్షన్లు ఉంటాయి. దీనితో చర్మ అవసరాలకు తగినట్టుగా కరెంటు స్థాయిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా చికిత్స సమయాన్ని కూడా సెట్‌ చేసుకోవచ్చు. 

ఈ బ్యూటీ డివైస్‌కి ట్రీట్‌మెంట్‌ హెడ్స్‌ వేరువేరుగా ఉంటాయి. ముక్కు, కళ్లు భాగాలను మసాజ్‌ చేసుకోవడానికి ఒక హెడ్, ముఖానికి ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి మరో హెడ్, మొత్తం బాడీని మసాజ్‌ చేయడానికి ఇంకో హెడ్‌ ఇలా మూడు వేరువేరు హెడ్స్‌ లభిస్తాయి. ఈ రకమైన ఫీచర్లు ఉన్న డివైస్‌తో చర్మ సంరక్షణను సులభతరం చేసుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.

 

(చదవండి: Back pain during pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)