Breaking News

కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?

Published on Sat, 01/11/2025 - 11:46

శరీరానికి కాల్షియం అనేక రోజువారీ పనులు చేసేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల మన డైట్‌లో కాల్షియంని చేర్చుకోవడం ముఖ్యం. జున్ను, బొప్పాయి, మల్బరీ, లిచీ, కివి, బచ్చలికూర, బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే...

పాలు, రాగులు రెండూ ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి..100 మి.లీ పాలు తాగితే 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగులని తీసుకుంటే, దాదాపు 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచితే, ఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రాగులు మంచిది. 

రాగుల్లో ఉండే  పొటాషియం వంటి ఇతర  పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడతాయి.   పాలలో పోషకాలతో  పాటు ఉండే ఎలక్ట్రోలైట్స్‌ బాడీని హైడ్రేట్‌ చేస్తాయి. రాగులు షుగర్‌ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ని నియంత్రిస్తుంది కాబట్టి, మీ అవసరాలని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవడం ఉత్తమం.

ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్‌ ఫుడ్‌ ఈ లడ్డూ...అంతేనా!

రాగులు, ఆరోగ్య ప్రయోజనాలు
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాగిగా ప్రసిద్ధి చెందిన ఫింగర్ మిల్లెట్ అతి ముఖ్యమైన చిరుధాన్యాలలో ఒకటి ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి దీనిని తరచుగా శిశువులకు , వృద్ధులకు ఆహారంగా  ఇవ్వవచ్చు. రాగులలో ప్రోటీన్ ,ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి.

  •  సంతృప్తిగా ,కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది.

  • ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

  • రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది

  • గ్లూటెన్  రహితం కాబట్టి గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.

  • తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది , అసంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.

  • కాల్షియం మూలమైన రాగులు  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

  • మొలకెత్తిన రాగులు విటమిన్ బి 12 అవసరాలను తీరుస్తాయి.

  • శీతాకాలంలో ఇది బెస్ట్‌ ఫుడ్‌. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

  • ఇది మలబద్దకానికి సహాయపడుతుంది.

ఎవరు తీసుకోకూడదు

  • మూత్రపిండాల్లో రాళ్ళు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారు

  • రాగులలో పొటాషియం అధికంగా  ఉంటుంది కనుక హైపర్కలేమియా లేదా సీరం పొటాషియం స్థాయిలు పెరిగినవారు. 

  • అలాగే రాగులు  రాత్రి  పూట తినకుండా ఉండటం మంచిది.

ఇదీ చదవండి : ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?


 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)