Breaking News

పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..!

Published on Mon, 06/02/2025 - 11:53

బాలీవుడ్‌లో ప్రఖ్యాత నటి, నాట్యకళాకారిణిగా ఒక ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్న హీరోయిన​ హెలెన్‌. 80లలో ప్రసిద్ధ​ ఐకానిక్‌ పాటల్లో నర్తించి ప్రేకక్షకులను మంత్రముగ్దులను చేసేది. ఇప్పటికి ఆ పాటలు చెవిన పడగానే..నాటి కుర్రకారుని ఉర్రూతలూగించిన అందాల నటి హెలెన్‌ కళ్లముందు కదలాడుతుంది. అంతలా బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందామే. ఇప్పుడామె ఎనిమిది పదుల వయసుకి చేరుకుని బామ్మలా ఉన్నా కూడా..అంతే జోష్‌ హుషారుతో ఉంటారామె. అచ్చం 85 ఏళ్ల అమ్మాయి అనేలా ఉంటుంది ఆమె ఉత్సాహం చూస్తే. కాలక్రమేణ వచ్చే వృద్ధాప్యానికి చెక్‌పెట్టి..యవ్వనంగా బతకడం ఎలా అనేందుకు ఆమెనే ఓ ఉదాహరణ. మరి అంతలా ఆమె ఎవర్‌గ్రీన్‌ ఎనర్జీ వెనకున్న ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో చూద్దామా..!.

సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా నటి హెలెన్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దాంతో ఒక్కసారిగా హెలెన్‌ మరింత ఫేమస్‌ అయ్యిపోయారు. ఆ ఏజ్‌లో కూడా ఇంత ఎనర్జీనా అని నెటిజన్లు విస్తుపోతున్నారు. 85 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా చెంగుచెంగుమని తిరుగుతున్న ఆమె యాక్టివిటీని చూసి.. వృద్ధాప్యం చిన్నబుచ్చికుని దూరంగా వెళ్లిపోయాందా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు నెటిజన్లు. 

ఆ వీడియోలో ..నటి హెలెన్‌  తనను తాను పరిచయం చేసుకుంటూ..బలంగా, చరుగ్గా ఉండాలంటే పైలేట్స్‌ వ్యాయామాలు మన దినచర్యలో భాగం కావాలని చెబుతున్నట్లు కనిపిస్తుంది. తాను 85 ఏళ్ల అమ్మాయినే బామ్మను మాత్రం కాను అని నవ్వుతూ చెబుతున్నారామె. ఇప్పుడు కూడా మీరు ఈ కఠినతరమైన పైలేట్స్‌ వ్యాయామాలు చేస్తారా అని ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ ప్రశ్నించగా..ఓ చేద్దాం అని నటి హెలెన్‌ అన్నారు. 

వెంటనే పైలేట్స్ బాల్ మీద పడుకుని..శ్వాసను సమన్వయం చేస్తూ వ్యాయామాలు ఈజీగా చేశారామె. అలాగే ఎవరి సాయం లేకుండా ఈజీగా లేవడం, నిలబడటం వంటివి చేయగలరు. ఆఖరికి స్టెప్స్‌పై కూడా చకచక నడిచేస్తారామె. 

అంతేగాదు హాయిగా జంపింగ్‌, రన్నింగ్‌ కూడా చేస్తారామె. తన ఈ ఉత్సాహానికి కారణం పైలేట్స్ తన దినచర్యలో భాగమవ్వడమేనని అన్నారు. అంతేగాదు ఆ వీడియో చివరలో  ఓ మై డార్లింగ్‌ అనే పాటకు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేయడం హైలెట్‌గా నిలిచింది. ఆమె వృద్ధాప్యాన్ని ఆరోగ్యకరంగా నిర్వచించడానికి స్ఫూర్తిగా నిలిచారు . 

 

వృద్ధులు తప్పకుండా చేయాల్సిన పైలేట్స్‌ వ్యాయామాలు..

  • సింగిల్ లెగ్ పుల్ అండ్‌ డబుల్ లెగ్ పుల్ - ఈ వ్యాయామాలు కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. శరీరం సమతుల్యత, స్థిరత్వానికి చాలా అవసరం.

  • సైడ్-లైయింగ్ సిరీస్ - ఇది మన కదలికలను మెరుగుపరుస్తుంది

  • మోడిఫైడ్ ప్లాంక్ -  కీళ్లపై ఒత్తిడి పెట్టకుండా బలాన్ని పెంచుతుంది.

  • వాల్ పైలేట్స్ - ఈ వ్యాయామాలను గోడ సాయంతో చేయవచ్చు.

  • తొడ మడతలు - ఈ వ్యాయామాన్ని కుర్చీ సహాయంతో చేయవచ్చు . పైగా వృద్ధులు ఈజీగా నడిచేందుకు హెల్ప్‌ అయ్యే మంచి వ్యాయామం ఇది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఇలాంటి వ్యాయామాలు చేసే ముందు ఫిట్‌నెస్‌ నిపుణుల సలహాలు, సూచనలతో చేయడం ఉత్తమం.

(చదవండి: వందేళ్ల అందాల బామ్మ..మేకప్‌ పాఠాలు! క్యూకడుతున్న ప్రసిద్ధ బ్రాండ్‌లు)


 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)