Breaking News

భానుడి భగ భగ: ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

Published on Fri, 03/15/2024 - 18:49

మార్చి మాసం ముగియుకుండానే భానుడి భగ భగలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు తట్టుకొని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వేసవిలో వడ దెబ్బ ప్రమాదం పెరుగుతుంది. మరి వడదెబ్బ, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో పిల్లా పెద్దా అంతా అప్రతమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా, నీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు  బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి.  వీటితోపాటు  రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తీసుకోవడం  ఆరోగ్యానికి ఎంతో మంచిది.  ఆరోగ్యాన్నిచ్చే  వివిధరకాల తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగు, మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష, బొప్పాయి వంటివి ఈ సీజన్‌లో తీసుకోవడం మేలు చేస్తుంది. అతిగా ఆహారం తీసుకోవడం హానికరం. నీటిని ఎక్కువగా వాడాలి.దాహంగా ఉంది కదా అని రసాయన సహిత కూల్‌ డ్రింక్స్‌, శుభ్రమైన ఐస్‌ వాడని డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్స్‌ తినకూడదు.  ఫాస్ట్‌ ఫుడ్‌,  బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. 

పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలి. తప్పదు అనుకుంటే, ఎండను తట్టుకునేలా తలపై టోపీ లేదా  గొడుగు వాడాలి.

బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన   నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. ఉల్లి పాయ రసం తాగితే వడదెబ్బ తగలకుడా చేస్తుంది. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా మంచిదే. చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అలాగే ఎండలోంచి లోపలికి వచ్చిన వెంటనే గట గటా  చల్లని నీళ్లు తాగకూడదు.  

ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, వాంతులు, కళ్లు తిరగడం, తలనొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే  వైద్యుణ్ని  సంప్రదించాలి. తక్షణమే చికిత్స తీసుకోవాలి. 

Videos

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)