Breaking News

ఇల్లు అమ్ముకుని లక్షలు పంచుకున్నారు, అమ్మానాన్నలను గెంటేశారు!

Published on Wed, 05/14/2025 - 14:37

మణికొండ: జీవిత చమరాంకంలో అండగా ఉంటారనుకున్న కుమారులు రోడ్డు పాలు చేశారు..కూతురైన కరుణించకపోతుందా అనుకుంటే ఆమె సైతం సోదరులతోనే చేతులు కలిపింది. వారందరూ కలిసి ఇంటిని అమ్మేసి తల్లిదండ్రులను బయటకు గెంటేశారు. ఈ ఘటన నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల కొమరయ్య, లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కొమరయ్య రంగులు వేసే పనిచేసి నార్సింగిలో 150 గజాల్లో ఇంటిని నిర్మించుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి వారందరికీ వివాహాలు చేశారు. 

అయితే ఇంటిని కుమారులు, కూతురు కలిసి ఇటీవల రూ.60 లక్షలకు అమ్మేసి ముగ్గురు రూ. 20 లక్షల చొప్పున పంచుకున్నారు. తర్వాత తల్లిదండ్రులను భారంగా భావించి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామంలోని లక్ష్మమ్మ ఆలయ ఆవరణలో నివసిస్తున్నారు. కుమారులు, కూతురు స్థానికంగానే ఉన్నా వారికి అన్నం పెట్టడం లేదు. దాంతో వారం రోజులుగా ఆలయం చుట్టు పక్కల వారి ఇళ్లకు వెళ్లి అడుక్కు తింటున్నారు.  

ఆర్డీఓకు ఫిర్యాదు.. 
స్థానిక మాజీ కౌన్సిలర్‌ ఉషారాణి, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీబాయితో కలిసి కొమరయ్య రాజేంద్రనగర్‌ ఆర్డీఓ వెంకట్‌రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తనకు వచ్చే రూ. 2వేల పింఛన్‌ రూ.5 వేలు అవుతుందని, సంతకం పెట్టాలని తీసుకెళ్లి తనను మోసం చేశారని కొమరయ్య ఆర్డీఓతో రోధిస్త చెప్పాడు. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని, తమను ఆదుకోవాలని కోరారు.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)