Breaking News

శాకాహారంతో మధుమేహం ముప్పు తగ్గుతుందా?

Published on Tue, 12/19/2023 - 11:34

డయాబెటిస్‌ అనేది జీవితకాలం వేధించే సమస్య. ఇప్పటివరకు దీనికి శాశ్వత పరిష్కారం లేకపోయినా సరైన డైట్‌తో మధుమేహాన్ని నివారించవచ్చు అని ఓ అధ్యయనంలో తేలింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని(plant-based diet) తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు 24% వరకు తగ్గుతుందని మెడ్‌యునీ వియెన్సాస్‌ సెంటర్‌ జరిపిన రీసెర్చ్‌లో వెల్లడైంది.

దీని ప్రకారం..పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు వంటి శా​కాహారంతో మధుమేహాన్ని నివారించడంతో పాటు ఇప్పటికే డయాబెటిస్‌ ఉన్నవారికి మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరోసారి ఇది రుజువైంది. శాకాహారం తినడం వల్ల కాలేయం, కిడ్నీ పనితీరు మెరుగవడంతో పాటు, డయాబెటిస్‌ ముప్పు తగ్గేందుకు తోడ్పుతుందని పరిశోధకులు గుర్తించారు.

మాంసాహారంలో అధికంగా  ఉండే మాంసకృత్తులు, పిండిపదార్థాలు.. డయాబెటిస్‌కు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. ఊబకాయం,వయసు పైబడటం, శారీరక శ్రమ లేకపోవడం సహా జన్యపరమైన కారణాల వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉన్నా శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఆహారంలో అధిక మొత్తంలో స్వీట్లు, ప్రాసెస్‌ చేసిన పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ వంటివి టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని పెంచుతాయని, అందుకే మనం తీసుకునే ఆహారం మధుమేహం నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మాంసాహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువగా తినడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ రిస్క్‌ పెరుగుతుందని తెలిపారు. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)