Breaking News

మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!

Published on Thu, 10/31/2024 - 13:12

వయసు నలభై దాటిందో  లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి  లక్షణాలు కనిపిస్తున్నాయి.  జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్‌ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి.  ఫలితగా మోకాళ్ల నొప్పులు  రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి  ఆహారాన్ని తీసుకోవాలి.

మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు  బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే  అలవాటు చేయాలి. ఇది జీవితాంతం  ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.

మెనోపాజ్‌
ఆడవారిలో మెనోపాజ్‌ తరువాత ఎముకలు బలహీనపడతాయి.  కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి.   బహిష్టులు ఆగిపోయిన తరువాత  ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది.  అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. 

శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. 

నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత  కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర  తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే.  

ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా  సమస్యను గుర్తిస్తే  వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. 

ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు  విటమిన్ సి  లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది.  అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)