వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..

Published on Tue, 07/21/2026 - 11:26

వర్షాకాలం అంటేనే చాలు ఇన్ఫెక్షన్లు అధికమవుతాయి. అదీగాక చాలామంది పలానా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నామంటూ వాపోతారు. దాంతో ఈ కాలం వ్యాధుల కాలమా? అనే ఫీలింగ్‌ కలుగుతంది కూడా. అసలు ఈ కాలంలో ఎందుకిలా జరుగుతుంది? అందుకు గల కారణాల గురించి ఆరోగ్య నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.

వర్షాకాలంలో అధిక తేమ, నీరు నిల్వ ఉండటం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు బ్యాక్టీరియా, వైరస్‌లు, దోమలు వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల సులభంగా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. అలాగే చాలా ప్రాంతాలు వరదల కారణంగా ముప్పుకి గురవ్వుతాయి. దీంతో నీటినిల్వలు అధికమై దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఈ కలుషిత నీటి వల్ల తీసుకున్న ఆహారం సైతం పాయిజన్‌ అయ్యి, జీర్ణ సంబంధిత సమస్యలు, టైఫాయిడ్‌, హెపటైటిస్‌ఏ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికమవుతాయని అంటున్నారు. అలాగే వాతావరణంలోని అధిక తేమ ఫలితంగా శిలింధ్రాలు లేదా బ్యాక్టీరియా వృద్ధికి దారితీసి మరిన్ని చర్మవ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. పైగా ఈ కాలంలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలోనూ, ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటారు. ఫలితంగా ఈ వైరస్‌లు ఒకరి నుంచి ఒకరికి సులభంగా సంక్రమిస్తాయని అన్నారు. అందుకే ఈకాలంలో జలుబు, ఫ్లూ, వైరల్‌ జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ఈ కాలంలో బాత్రూంలను ఉపయోగించిన తర్వాత తినడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలి. 

తాజా ఆహారాన్ని మాత్రమే తినండి, శుభ్రమైన ఫిల్టర్‌ చేసినా లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండి

రోడ్డు పక్కన కోసిన పండ్లు, పచ్చి సలాడ్‌లు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ, కావున నివారించండి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి సమీపంలో ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోండి

కీటక నివారిణులను ఉపయోగించడం, ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దోమల నివారణ వలలను వాడటం, పూర్తి చేతుల కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం ద్వారా కీటకాల కాటును నివారించండి.

వర్షంలో బూట్లు లేదా దుస్తులు తడిస్తే, ఫంగల్ చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి పొడి బూట్లు లేదా దుస్తులు మార్చుకోండి. 

మధుమేహం, ఆస్తమా, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు, చిన్నపిల్లలు లేదా వృద్ధులు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి తగిన శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఇవి వైరల్‌ ఇన్ఫెక్షన్లను తగ్గించకపోగా, యాంటీ బయోటిక్‌ నిరోధకతను పెంచుతుంది. రెండు రోజుల కంటే ఎక్కువ కాలం జ్వరం, తీవ్రమైన నొప్పి, నిరంతర వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రవిసర్జన తగ్గడం, రక్తస్రావం లేదా నీరసం వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అదీగాక వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే, వైద్యులు సమస్యకు తగిని విధంగా చికిత్స అందించి ఇతర సమస్యలు తలెత్తకుండా నివారించగలరనే విషయం గుర్తించుకోండి అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: జస్ట్‌ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..)

 

 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)