Breaking News

లిపోప్రొటీన్‌(ఎ)తో గుండెకు ప్రమాదం..!

Published on Thu, 09/25/2025 - 10:45

గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే జన్యు ఆధారిత సమస్య లిపోప్రొటీన్‌(ఎ) పై అవగాహన లోపం శాపమవుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఔషధ సంస్థ నవార్టిస్‌ బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తుంటే అందులో 5వ వంతు భారతీయులే ఉండటానికి కారణం లిపోప్రొటీన్‌(ఎ) అని వీరు స్పష్టం చేశారు. మన దేశీయుల్లో 34% మందికి లిపోప్రొటీన్‌(ఎ) స్థాయి అధికం కాబట్టి ముందస్తు రక్తపరీక్షల ద్వారా దీన్ని గుర్తించడం కీలకమని అపోలో ఆస్పత్రి కార్డియాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ.శ్రీనివాస్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 

ఈ లిపోప్రోటీన్‌ రక్త నాళాల గోడలలో పేరుకుపోయి, LDL కొలెస్ట్రాల్ మాదిరిగానే ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు శరీరంలోని ఇతర భాగాల వంటి ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోకులు, ఇతర హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.

కేవలం రక్తపరీక్షతో పెను ప్రమాదాన్ని నివారించవచ్చనే విషయం చాలా మందికి తెలీదని హార్ట్‌ హెల్త్‌ ఇండియా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు రామ్‌ ఖండేల్వాల్‌ అన్నారు. ఈ సందర్భంగా సాధారణ ఆరోగ్య కార్యక్రమాల్లో లిపోప్రొటీన్‌(ఎ) పరీక్షను భాగం చేయాలని ప్రభుత్వాలను వైద్యులు కోరారు. 

(చదవండి:  పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)